For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఘోరంగా విఫలం: రోహిత్‌కు ఏమైంది?, ట్విట్టర్‌లో జోకులు

By Nageshwara Rao

రాంచీ: టీమిండియాలో అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ ఒకడు. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరిస్‌లో ఆశించిన స్థాయి మేరకు రాణించలేక తీవ్ర విమర్శలకు గురవుతున్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఆడిన నాలుగు వన్డేల్లో సాధించిన పరుగులు 14, 15, 13, 11.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోహిత్ శర్మ ప్రస్తుతం నిలకడ లేమితో అవకాశాన్ని వృథా చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు సొంతగడ్డపై 37 వన్డే మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 56.48 యావరేజితో 1751 పరుగులు పూర్తి చేశాడు. అందులో 4 సెంచరీలు ఉండగా, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. నిజానికి భారత్‌లో రోహిత్ శర్మ ఎంతలా చెలరేగిపోతాడో వీటిని చూస్తే తెలిసిపోతుంది.

ఒక్కోసారి గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లతో అదరహో అనిపిస్తాడు. మరికొన్ని సార్లు చెత్తగా ఆడుతుంటాడు. టెస్టుల్లో క్రీజులో ఎక్కవ సేపు నిలబడలేడని, విదేశీ పిచ్‌లపై తేలిపోతాడని ఇలా రోహిత్‌పై చాలా విమర్శలు ఉన్నాయి. అయితే ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో రెండు మూడు కీలక ఇన్నింగ్స్‌లతో విమర్శలకు సమాధానం చెప్పాడు.

 Rohit Sharma

ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన రెండో టెస్టులో 82 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరిస్‌లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. సాధారణంగా ఒకటి లేదా రెండు వన్డేల్లో విఫలం చెందుతున్నాడు అంటూ సహజం అనుకోవచ్చు.

కానీ ఇలా ఓ సిరిస్ మొత్తం ఘోరంగా విఫలమవ్వడం రోహిత్ అభిమానుల్లో కంగారు కలిగించే అంశమే. అంతేకాదు తనకు బాగా కలిసొచ్చే వన్డేల్లో రోహిత్ శర్మ ఎందుకు విఫలమవుతున్నాడో అర్ధం కావడం లేదు. తన ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా న్యూజిలాండ్ సిరిస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

బహుశ తనతో పాటు ఓపెనింగ్‌కు వస్తున్న రహానేతో సమన్వయం కుదరక ఇబ్బంది పడుతున్నాడో ఏంటో మరి. న్యూజిలాండ్‌తో ఇప్పటివరకు జరిగిన నాలుగో వన్డేల్లో రెండుసార్లు వికెట్‌కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చిన రోహిత్‌, మరో రెండు సార్లు క్యాచ్‌ల రూపంలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారమంతా కోహ్లి మీద పడుతోంది.

మరోవైపు న్యూజిలాండ్ సిరిస్‌లో రోహిత్ శర్మ ఘోరంగా విఫలమవడంతో ట్విట్టర్‌లో జోకులు పేలుతున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+