పోరాడి ఓడిన భారత్.. ఫైనల్‌కు న్యూజిలాండ్

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్‌తో జరుగుతున్నసెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ 49.2 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. భారత్ చివరి వరకు పోరాడినా.. కీలక సమయంలో జడేజా, ధోనీ ఔట్ అవ్వడంతో కివీస్ గెలుపొందింది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ప్రయాణం సెమీస్‌తోనే ముగిసింది. వరుసగా రెండో ప్రపంచకప్‌లోనూ భారత్ సెమీస్‌లోనే ఇంటిదారి పట్టగా.. మరోవైపు న్యూజిలాండ్ రెండో సారి ఫైనల్‌కు చేరింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

హెన్రీ షాక్:
కివీస్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ షాక్ ఇచ్చాడు. నాలుగు బంతులు ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మ (1; 4 బంతుల్లో) ఒక్క పరుగు మాత్రమే చేసి కీపర్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో పేసర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన 2.4వ బంతిని ఆడే క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (1; 6 వికెట్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. విరాట్ సమీక్ష కోరినా.. ఫలితం లేకుండా పోయింది.

5 పరుగులకే కీలక మూడు వికెట్లు:
దీని నుంచి తేరుకోకముందే మాట్ హెన్రీ మరో షాక్ ఇచ్చాడు. కేఎల్ రాహుల్ (1; 7 బంతుల్లో)ను హెన్రీ (3.1వ బంతికి) పెవిలియన్ చేర్చాడు. దీంతో టీమిండియా 5 పరుగులకే కీలక మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో భాద్యతగా ఆడాల్సిన దినేష్ కార్తీక్ (6; 25బంతుల్లో) ఔట్ అయ్యాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో జేమ్స్ నీషమ్ సూపర్ క్యాచ్ పట్టడంతో కార్తీక్ పెవిలియన్ చేరాడు. అనంతరం రిషభ్ పంత్ (32; 56 బంతుల్లో 4×4) శాంట్నర్ వేసిన 22.5వ బంతిని షాట్ ఆడి గ్రాండ్‌హోమ్‌కి చిక్కాడు.

అర్ధ శతకాలు:
శాంట్నర్ వేసిన 30.3వ బంతికి హార్దిక్ పాండ్యా (32; 62 బంతుల్లో 2×4) భారీ షాట్ ఆడగా.. కెప్టెన్ విలియమ్సన్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో భారత్ 94 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (77 59 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు), ఎంఎస్ ధోనీ (50 72 బంతుల్లో ఫోర్, సిక్స్) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్ గెలుస్తుందని భావించారు.

జడేజా క్యాచ్ ఔట్.. ధోనీ రనౌట్:
జడేజా, ధోనీ ఇద్దరూ 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఐతే ఆఖర్లో జడేజా క్యాచ్ ఔట్.. ధోనీ రనౌట్ కావడంతో భారత్ ఓటమి ఖాయమైంది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ మూడు.. బౌల్ట్, శాంట్నర్ రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు 211/5తో ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. విలియమ్సన్ (67), రాస్ టేలర్ (74) పరుగులు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications