India vs New Zealand Schedule 2022: టీ20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు ఇండియా.. షెడ్యూల్, టైమింగ్స్!

ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ తర్వాత పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం భారత్ న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. న్యూజిలాండ్ పర్యటనలో భారత్ మూడు టీ20ల సిరీస్, అలాగే మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఇక ఈ సిరీస్‌లు నవంబర్ 18 నుంచి 30మధ్య జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది జనవరిలో పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం న్యూజిలాండ్ టీం తిరిగి ఇండియాలో పర్యటించనుంది. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్, టౌరంగ, నేపియర్‌లలో మూడు టీ20లు జరగనుండగా.. ఆక్లాండ్, హామిల్టన్, క్రైస్ట్‌చర్చ్ స్టేడియాలో మూడు వన్డేలు జరగనున్నాయి. కివీస్‌తో సిరీస్ కోసం భారత్ ప్రపంచ కప్ ముగిశాక న్యూజిలాండ్‌కు చేరుకుంటుంది అని న్యూజిలాండ్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ సిరీస్‌ల తర్వాత న్యూజిలాండ్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. ఆ తర్వాత జనవరిలో ఇండియా పర్యటనకు రానుంది. ఇక ఫిబ్రవరి ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో టౌరంగలో ఓ డే అండ్ నైట్ టెస్ట్‌తో పాటు వెల్లింగ్‌టన్‌లో ఓ డే టెస్టులకు స్వదేశంలో న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వనుంది. ఇక టీమిండియా శుక్రవారం నుంచి ఇంగ్లాండ్‌తో తిరిగి షెడ్యూల్ చేయబడిన అయిదో టెస్ట్ ఆడనుంది. అనంతరం మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కూడా టీమిండియా ఆడనుంది. ఇక అనంతరం భారత్ జులై-ఆగస్టులో మూడు వన్డేలు, ఐదు టీ20ల కోసం వెస్టిండీస్‌లో పర్యటించనుంది.
భారత న్యూజిలాండ్ పర్యటన షెడ్యూల్ వివరాలు
టీ20 సిరీస్
నవంబర్ 18న రాత్రి 7.30: తొలి టీ20, స్కై స్టేడియం, వెల్లింగ్టన్
నవంబర్ 20న రాత్రి 7.30: రెండో టీ20, బే ఓవల్, మౌంట్ మౌంగనుయి
నవంబర్ 22న రాత్రి 7.30: 3వ టీ20, మెక్లీన్ పార్క్, నేపియర్
వన్డే సిరీస్
నవంబర్ 25న మధ్యాహ్నం 2.30: తొలి వన్డే, ఈడెన్ పార్క్, ఆక్లాండ్
నవంబర్ 27న మధ్యాహ్నం 2.30: రెండో వన్డే; సెడాన్ పార్క్, హామిల్టన్
నవంబర్ 30న మధ్యాహ్నం 2.30: మూడో వన్డే, హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications