కివీస్‌తో మ్యాచ్: సచిన్ 16 ఏళ్ల ప్రపంచ రికార్డుకు రోహిత్ శర్మ ఎసరు!

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ(647)తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించడంతో రోహిత్ శర్మ అనేక రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ముఖ్యంగా ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో నాలుగు సెంచరీలతో ఈ జాబితాలో ఉన్న శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రికార్డును రోహిత్ శర్మ బద్దలుగొట్టాడు. 2015 ప్రపంచకప్‌లో కుమార సంగక్కర నాలుగు సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ కన్ను క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల రికార్డుపై పడింది.

పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌తో తొలి సెమీస్‌లో తలపడుతుంది. మంగళవారం జరగనున్న ఈ మ్యాచ్‌కి ఓల్ట్ ట్రాఫోర్డ్ ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ గనుక 27 పరుగులు చేస్తే ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంటాడు.

ప్రపంచ రికార్డుకి చేరువలో రోహిత్
ఇంతకీ ఏంటా? అరుదైన రికార్డుని అనుకుంటున్నారా? ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2003 వరల్డ్‌కప్‌లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు చేశాడు. టీమిండియా ఫైనల్ వరకు వెళ్లిన ఈ టోర్నీలో సచిన్ సెంచరీతో పాటు ఆరు హాఫ్ సెంచరీలు చేశాడు.

సచిన్ 16 ఏళ్ల రికార్డుకు రోహిత్ ఎసరు
సచిన్ నమోదు చేసిన ఈ అత్యధిక పరుగుల రికార్డు 16 ఏళ్ల వరకు అలాగే ఉంది. అయితే, 2007 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్(659) పరుగులతో సచిన్ రికార్డుకి చేరువగా వచ్చినప్పిటికీ బద్దలు కొట్టలేకపోయాడు. అయితే, ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఈ రికార్డు బద్దలయ్యేలా కనిపిస్తోంది.

మరో 27 పరుగులు చేస్తే
మంగళవారం న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి సెమీఫైనల్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో 27 పరుగులు చేస్తే సచిన రికార్డు బద్దలవడం ఖాయం. అలా కాకుండా 53 పరుగులు చేస్తే ఒక ప్రపంచకప్‌లో 700 పరుగుల మార్కుని అందుకున్న తొలి క్రికెటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టిస్తాడు.

అద్భుతమైన ఫామ్‌లో రోహిత్
ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఇప్పటికే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఐదు సెంచరీలు బాదిన రోహిత్ శర్మ... మరో సెంచరీ సాధిస్తే ఎవరికీ అందనంత ఎత్తుకు చేరతాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ రికార్డుని అందుకోవాలని భారత క్రికెట్ అభిమానులు పూజలు చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications