India vs New Zealand: మరో ప్రపంచ రికార్డుకి చేరువలో రోహిత్ శర్మ

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 ఆదివారం మధ్యాహాం 12.30 గంటలకు హామిల్టన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు చేరనుంది. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు మొత్తం 102 సిక్స్‌లు బాదాడు.
మరో రెండు సిక్స్‌లు బాదితే టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం 103 సిక్స్‌లతో క్రిస్ గేల్, మార్టిన్ గప్టిల్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. మూడో టీ20లో రోహిత్ శర్మ మరో రెండు సిక్సులు బాదితే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు.

చివరి మ్యాచ్‌లో రెండు సిక్స్‌లు
కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌లో రెండు సిక్స్‌లు బాదిన రోహిత్ శర్మ.. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా ధోనీ (215 సిక్స్‌లు) రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ కెప్టెన్సీలో 14 టీ20లు ఆడిన టీమిండియా 12 మ్యాచుల్లో గెలవగా.. కేవలం రెండింట్లో మాత్రమే ఓడింది.

మూడో టీ20లో గెలిపిస్తే
ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరగబోయే మూడో టీ20లో గెలిపిస్తే.. భారత్ తరఫున మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో రెండోస్థానానికి రోహిత్ శర్మ చేరనున్నాడు. ఈ జాబితాలో ధోనీ (72 మ్యాచుల్లో 41 విజయాలు) తొలి స్థానంలో ఉండగా.. కోహ్లీతో (20 మ్యాచుల్లో 12 విజయాలు) కలిసి రోహిత్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

రోహిత్ శర్మ మాట్లాడుతూ
మూడో టీ20 నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ "తొలి టీ20లో జరిగిన తప్పుల్ని సమీక్షించుకున్నాం. హామిల్టన్‌లో పోరు రసవత్తరంగా సాగుతుంది. మేం సుదీర్ఘ కాలంగా పర్యటనలో ఉన్నాం. కాబట్టి కుర్రాళ్లపై ఎక్కువ ఒత్తిడి పెంచదలుచుకోలేదు. ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకుండా మైదానంలోకి వెళ్లి ప్రశాంతంగా ఆడాలి" అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications