న్యూజిలాండ్ గడ్డపై 52 ఏళ్ల రికార్డుకి అడుగు దూరంలో టీమిండియా!

హైదరాబాద్: న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా అరుదైన రికార్డు ముంగిట నిలిచింది. ఈ సిరిస్‌లో అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్‌మెన్లు రాణించడంతో రెండు వన్డేలు మిగిలుండగానే ఐదు వన్డేల సిరీస్‌ని 3-0తో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.
హామిల్టన్ వేదికగా గురువారం ఉదయం 7.30 గంటల నుంచి నాలుగో వన్డే ప్రారంభం కానుంది. ఈ వన్డేలో గనుక టీమిండియా విజయం సాధిస్తే, న్యూజిలాండ్ గడ్డపై భారత క్రికెట్ జట్టు ఐదు దశాబ్దాల రికార్డుని తిరగరాయనుంది. 1967 నుంచి ఆ గడ్డపై పర్యటిస్తున్న టీమిండియా చరిత్రలో ఒక్కసారి మాత్రమే 3-1 తేడాతో విజయాన్ని అందుకుంది.

ధోని నాయకత్వంలోని టీమిండియా
మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని టీమిండియా 2008-09 పర్యటనలో ఈ విజయాన్ని నమోదు చేసింది. కాగా, హామిల్టన్ వేదికగా గురువారం జరిగే నాలుగో వన్డేలో భారత్ గెలిస్తే కివీస్ గడ్డపై 4-0తో గెలుపు అత్యుత్తమం అవతుంది. ఇటీవలే ఆసీస్ గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కోహ్లీసేన 2-1తో టెస్టు సిరిస్‌ను నెగ్గిన సంగతి తెలిసిందే.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ
ఇదిలా ఉంటే, చివరి రెండు వన్డేలతో పాటు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరిస్ నుంచి కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉంటే, గురువారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే నాలుగో వన్డే రోహిత్ శర్మకు 200వ వన్డే.

కెరీర్‌లో 200వ వన్డే ఆడుతోన్న రోహిత్
ఇప్పటికే 3-0తో టీమిండియా సిరిస్‌ను చేజిక్కించుకోవడంతో రోహిత్ శర్మపై పెద్దగా ఒత్తిడి ఉండదు. 31 ఏళ్ల రోహిత్ 2007లో బెల్ ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌పై తొలివన్డే మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకూ భారత్ తరుపున 199 వన్డేలాడిన రోహిత్ శర్మ 7799 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఓపెనర్‌గా బరిలోకి
ఇక్కడ విశేషం ఏంటంటే తన 200వ వన్డేలో తానే కెప్టెన్‌గా వ్యవహరించడం. 2007లో దక్షిణాఫ్రికా-ఐర్లాండ్-ఇండియా జట్ల మధ్య జరిగిన ముక్కోణపు సిరిస్ ద్వారా రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు. 2013కు ముందు డోలాయమానంలో పడ్డ రోహిత్ కెరీర్‌ను ధోనీ గాడిలో పెట్టాడు. రోహిత్ మీద నమ్మకం పెట్టి అతడిని ఓపెనర్‌గా బరిలోకి దింపాడు.

'హిట్ మ్యాన్'గా గుర్తింపు
2013లో ఓపెనర్‌గా ప్రమోట్ అయిన తర్వాత రోహిత్ శర్మ భారత వన్డే జట్టుకు వెన్నుముకగా మారాడు. ఓపెనర్‌గా టీమిండియాకు అనేక అద్భుతమైన భాగస్వామ్యాలను నమోదు చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి రోహిత్ శర్మ 50 ఓవర్ల పాటు మ్యాచ్ ఆడిన సందర్భాలు కూడా అనేకం. ఇప్పుడు విజయవంతమైన ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications