India vs New Zealand: ధోని రికార్డు సమం చేసిన రోహిత్

హైదరాబాద్: ఆతిథ్య న్యూజిలాండ్‌తో సోమవారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సిక్సర్ల రికార్డుని సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 3 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 62 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ధోని రికార్డుని రోహిత్ శర్మ సమం చేశాడు. ఇప్పటివరకు వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా ధోని అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ధోని మొత్తం 337 వన్డేలాడి 222 సిక్స్‌లు బాదాడు. అందులో 7 సిక్సర్లు ఆసియా ఎలెవన్ జట్టు తరఫున సాధించినవి కావడం విశేషం.

రెండు సిక్సులతో ధోని సరసన రోహిత్
మిగతా 215 సిక్సులు భారత జట్టు తరుపున సాధించినవి. ఇప్పుడు మూడో వన్డేలో రోహిత్ శర్మ రెండు సిక్సులు బాదడంతో వన్డేల్లో 215 సిక్స్‌లు నమోదు చేశాడు. మూడో వన్డేలో న్యూజిలాండ్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ బౌండరీ మీదుగా సిక్స్ కొట్టిన రోహిత్.. ధోని సిక్సుల రికార్డుని సమం చేశాడు.

రెండో స్థానంలో సచిన్
వీరిద్దరి తర్వాత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 195 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక, గంగూలీ (189), యువరాజ్ (153) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. దీంతో పాటు లిస్ట్ ఎ క్రికెట్‌లో పది వేల పరుగుల మైలురాయి అందుకున్న పదో భారత బ్యాట్స్‌మన్‌గానూ రోహిత్ నిలిచాడు.

260 ఇన్నింగ్స్‌లో
260 ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. విరాట్ కోహ్లీ (219), సౌరవ్ గంగూలీ (252), సచిన్ టెండూల్కర్ (257) తర్వాత అత్యంత వేగంగా పది వేల పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ నిలిచాడు. కాగా, మూడో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

షమీకి మ్యాన్ ఆప్ ద మ్యాచ్ అవార్డు
దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో మరో రెండు వన్డేలు మిగిలుండగానే టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. టీమిండియాకు ఇది వరుసగా రెండో సిరిస్ విజయం. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన మహమ్మద్ షమీ(3/41)కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications