For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

200 ODIs: భారత్ తరుపున 14వ క్రికెటర్‌గా రోహిత్ శర్మ

India vs New Zealand: Rohit Sharma 14th Indian to appear in 200 ODIs

హైదరాబాద్: హామిల్టన్ వేదికగా గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. రోహిత్ శర్మకు ఇది 200వ వన్డే. దీంతో భారత్ తరుపున 200 వన్డేలాడిన 14వ క్రికెటర్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు.

1
44083

ఈ క్రమంలో భారత్ తరుపున 200 వన్డేలాడిన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, ధోని, అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, అజహరుద్దీన్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, విరాట్ కోహ్లీల సరసన రోహిత్ శర్మ నిలిచాడు. 31 ఏళ్ల రోహిత్ 2007లో బెల్ ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌పై తొలివన్డే మ్యాచ్ ఆడాడు.

ఇప్పటి వరకూ భారత్ తరుపున 200 వన్డేలాడిన రోహిత్ శర్మ 7806 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ అయితే రోహిత్ శర్మ ఇప్పటికే మూడు డబుల్ సెంచరీలు సాధించాడు.

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రోహిత్

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రోహిత్

2013లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాపై 209, 2014లో శ్రీలంకపై 264 పరుగులు సాధించాడు. వన్డేల్లో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరు. 2014లో శ్రీలంకతో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన వన్డేలో రోహిత్‌ 264 పరుగులు చేశాడు. ఇక, మూడో డబుల్ సెంచరీని 2017లో మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 208 పరుగులు చేసి సాధించాడు.

ప్రపంచ రికార్డు నమోదు

ప్రపంచ రికార్డు నమోదు

2013లో బెంగళూరులో ఆస్ట్రేలియాపై రోహిత్‌ తన కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీ సాధించాడు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీని సాధించే క్రమంలో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ 16 సిక్సులు బాదాడు. అప్పట్లో ఇది ప్రపంచ రికార్డు కావడం విశేషం. దీంతో ఏబీడివిలియర్స్‌, క్రిస్‌గేల్‌ వంటి దిగ్గజాల రికార్డులను సమం చేశాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాపై రోహిత్‌ ఇప్పటి వరకు 66 సిక్స్‌లు కొట్టాడు.

విజయవంతమైన ఓపెనర్‌గా

విజయవంతమైన ఓపెనర్‌గా

2013కు ముందు డోలాయమానంలో పడ్డ రోహిత్‌ కెరీర్‌ను ధోనీ గాడిలో పెట్టాడు. రోహిత్‌ మీద నమ్మకం పెట్టి అతడిని ఓపెనర్‌గా బరిలోకి దింపాడు. ఓపెనర్‌గా టీమిండియాకు అనేక అద్భుతమైన భాగస్వామ్యాలను నమోదు చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి రోహిత్ శర్మ 50 ఓవర్ల పాటు మ్యాచ్ ఆడిన సందర్భాలు కూడా అనేకం. ఇప్పుడు విజయవంతమైన ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు.

200వ వన్డేలో పేలవ ప్రదర్శన కనబర్చిన రోహిత్

200వ వన్డేలో పేలవ ప్రదర్శన కనబర్చిన రోహిత్

ఈ క్రమంలో ‘హిట్‌మ్యాన్‌'గానూ పేరు తెచ్చుకున్నాడు. తన 200వ వన్డేలో రోహిత్ శర్మ(7) పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచాడు. అంతేకాదు ఈ వన్డే రోహిత్ శర్మకు హామిల్ట‌న్ చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు కివీస్ బౌలర్ల దెబ్బకు 30.5 ఓవర్లలో కేవలం 92 పరుగులకే కుప్పకూలిపోయింది.

తొమ్మిదేళ్ల తర్వాత భారత్ అతిపెద్ద ఓటమి

తొమ్మిదేళ్ల తర్వాత భారత్ అతిపెద్ద ఓటమి

అనంతరం భారత్ నిర్దేశించిన 93 ప‌రుగుల ల‌క్ష్యాన్ని న్యూజిలాండ్ కేవ‌లం 14.4 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో భారత జట్టుపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియా ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అతిపెద్ద ఓటమిని రుచి చూసింది.

Story first published: Thursday, January 31, 2019, 13:46 [IST]
Other articles published on Jan 31, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+