2nd ODI: రోహిత్-ధావన్ జోడీ దెబ్బకు సచిన్-సెహ్వాగ్ రికార్డు బద్దలు


హైదరాబాద్: మౌంట్ మాంగనుయ్ వేదికగా న్యూజిలాండ్‌తో శనివారం ప్రారంభమైన రెండో వన్డేలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ అరుదైన రికార్డుని నెలకొల్పారు. న్యూజిలాండ్‌తో శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(87), శిఖర్ ధావన్ (66) జోడీ తొలి వికెట్‌కి 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
ఫలితంగా సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్ జోడీ అరుదైన రికార్డ్‌ని బద్దలు కొట్టారు. మ్యాచ్ ఆరంభం నుంచీ వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదుతూ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించడంతో పాటు వంద పరుగులకుపైగా భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి మధ్య ఇది 14వ సెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం.
వీరిద్దరూ వేగంగా ఆడడంతో భారత్ 18 ఓవర్లలోనే వంద పరుగుల మార్కును చేరుకుంది. దీంతో వన్డే చరిత్రలో అత్యధిక సెంచరీల భాగస్వామ్యం నెలకొల్పిన నాలుగో ఓపెనింగ్ జోడీగా రోహిత్-ధావన్‌ల జోడీ రికార్డుల్లో నిలిచింది.

వన్డేల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఓపెనింగ్ జోడీలనుపరిశీలిస్తే!
* సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీ (భారత్) - 21 సెంచరీల భాగస్వామ్యం
* ఆడమ్ గిల్‌క్రిస్ట్- మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా) - 16
* గార్డెన్- హేన్స్ (వెస్టిండీస్) - 15
* రోహిత్ శర్మ - శిఖర్ ధావన్ (భారత్) - 14
400 వికెట్ల క్లబ్‌లో ట్రెంట్ బౌల్ట్
మరోవైపు కివీస్ పేసర్ ఈ మ్యాచ్‌లో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్ తరుపున మూడు ఫార్మాట్లలో కలిసి 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. భారత ఓపెనర్ శిఖర్ ధావన్(66)ను ఔట్ చేయడం ద్వారా బౌల్ట్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. న్యూజిలాండ్ తరుపున ఈ జాబితాలో అగ్రస్థానంలో డానియేల్ వెటోరి(696), రిచర్డ్ హ్యాడ్లీ(589), టిమ్ సౌథీ(480), క్రిస్ కెయిన్స్(419)లు ఉన్నారు.

టీమిండియా
ప్రస్తుతం 46 ఓవర్లకు గాను టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. క్రీజులో ధోని(23 నాటౌట్), కేదార్ జాదవ్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు. అంతకముందు రోహిత్ శర్మ(87), శిఖర్ ధావన్ (66), విరాట్ కోహ్లీ(43), అంబటి రాయిడు(47) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications