Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs New Zealand: అరుదైన రికార్డుల ముంగిట ధోని, కోహ్లీ

India vs New Zealand: MS Dhoni needs 5 dismissals to go past Nayan Mongia record

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం మౌంట్ మాంగనూయ్‌లోని బే ఓవల్ స్టేడియంలో రెండో వన్డే జరగనుంది. ఈ వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ ధోనిలు అరుదైన రికార్డులను అందుకోనున్నారు.

31 వికెట్లు తీసిన ధోని

31 వికెట్లు తీసిన ధోని

న్యూజిలాండ్‌తో ఇప్పటివరకు జరిగిన వన్డేల్లో 31 వికెట్లలో పాలు పంచుకున్న ధోని, ఈ సిరిస్‌లో మరో 6 వికెట్లలో భాగస్వామ్యం అయితే నయాన్ మోంగియా 36 ఔట్ల రికార్డుని అధిగమిస్తాడు. న్యూజిలాండ్‌పై ఇప్పటికే ఐదు సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ మరో సెంచరీ సాధిస్తే, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆరు సెంచరీల రికార్డ్‌ని సమం చేస్తాడు.

జడేజా మరో 10 పరుగులు చేస్తే

జడేజా మరో 10 పరుగులు చేస్తే

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరో 10 పరుగులు చేస్తే వన్డేల్లో రెండు వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. భారత్‌తో జరిగిన వన్డేల్లో ఇప్పటికే నాలుగుసార్లు డకౌటైన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ రెండో వన్డేలో డకౌటైతే అత్యధిక సార్లు డకౌటైన రెండో న్యూజిలాండ్ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ఈ జాబితాలో బ్రెండన్ మెక్‌కలమ్ ఐదు సార్లు ఔటై అగ్రస్థానంలో ఉన్నాడు.

టిమ్ సౌథీ మరో రెండు వికెట్లు తీస్తే

టిమ్ సౌథీ మరో రెండు వికెట్లు తీస్తే

న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ మరో రెండు వికెట్లు పడగొడితే భారత్‌పై వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. డేనియల్ వెటోరీ, హాడ్లీ 27 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. కాగా, ఈ సిరిస్‌లో నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్ జట్టు ఐదు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

Story first published: Friday, January 25, 2019, 17:38 [IST]
Other articles published on Jan 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+