For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అసలేం జరిగింది?: గాయం కారణంగా మూడో వన్డేకి ధోని దూరం!

India Vs New Zealand : M.S.Dhoni Is Resting For The IPL? | Oneindia Telugu
India vs New Zealand: MS Dhoni misses 3rd ODI with hamstring injury

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. 37 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్ విషయంలో యువ క్రికెటర్లతో పోటీ పడుతుంటాడు. ఇక, వికెట్ల వెనుక ధోని గురించి చెప్పాల్సిన పనిలేదు. మెరుపు వేగంతో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను స్టంపౌట్ చేస్తుంటాడు.

అలాంటి ధోని తొడ కండరాల గాయం కారణంగా న్యూజిలాండ్‌తో సోమవారం ప్రారంభమైన మూడో వన్డేకి దూరమయ్యాడు. వరల్డ్ కప్ ముంగిట ధోని గాయం భారత అభిమానుల్లో కంగారు పెంచుతోంది. సుమారు ఆరేళ్ల కిందట ఇదే గాయం బారిన ధోని... మళ్లీ ఇప్పుడు ఈ గాయం బారిన పడ్డాడు.

మూడు సార్లు మాత్రమే

మూడు సార్లు మాత్రమే

2004, డిసెంబరు 23న భారత జట్టులోకి అరంగేట్రం చేసిన మహేంద్ర సింగ్ ధోని గాయం కారణంగా తుది జట్టులో లేకుండా బెంచ్‌పై కూర్చోవడం ఇది మూడోసారి కాగా 2013 తర్వాత ఇదే తొలిసారి. 12 ఏళ్ల క్రితం అంటే 2007లో దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లకి జ్వరం కారణంగా తుది జట్టులో ధోనీ చోటు కోల్పోయాడు.

తొడ కండరాల గాయం కారణంగా

తొడ కండరాల గాయం కారణంగా

ఆ తర్వాత మళ్లీ 2013లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో మూడు వన్డేలకి తొడ కండరాల గాయం కారణంగా దూరమయ్యాడు. తాజాగా మళ్లీ అదే గాయంతో సోమవారం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో తుది జట్టులో ధోని చోటుని కోల్పోయాడు. గతేడాది పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోని, ఈ ఏడాది ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరిస్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించి ఫామ్‌లోకి వచ్చాడు.

కంగారులో ధోని అభిమానులు

కంగారులో ధోని అభిమానులు

ప్రస్తుతం న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో సైతం ధోని అటు వికెట్ కీపర్‌గా, ఇటు బ్యాట్స్‌మెన్‌గా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అయితే, తాజాగా మూడో వన్డేలో ధోని గాయం కారణంగా తుది జట్టులో చోటు కోల్పోవడం... వరల్డ్‌కప్ ముంగిట ధోని అభిమానులను కంగారులోకి నెట్టింది.

Story first published: Monday, January 28, 2019, 14:07 [IST]
Other articles published on Jan 28, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+