Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ అవకాశం వస్తే అది నా జీవితంలో మరిచిపోలేని రోజు: సిరాజ్

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ ఆశిష్ నెహ్రా తనను ఓ సోదరుడిలా భావించేవాడని హైదరాబాద్‌ యువ ఆటగాడు మహమ్మద్‌ సిరాజ్‌ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ కోసం బీసీసీఐ సిరాజ్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Bowlers, fielders were clinical : Virat Kohli
 నెహ్రాతో ఉన్న అనుబంధంపై సిరాజ్

నెహ్రాతో ఉన్న అనుబంధంపై సిరాజ్

ఈ నేపథ్యంలో సిరాజ్... నెహ్రాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘ఐపీఎల్‌-2017లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాను. అప్పుడే నాకు నెహ్రాతో కలిసి ఆడే అవకాశం వచ్చింది. నెట్‌ సెషన్స్‌లో నెహ్రా నాకు ఎన్నో సలహాలు ఇచ్చాడు. ఈ కారణంగానే నేను నా గేమ్‌లో మరింతగా రాణించగలుగుతున్నాను' అని అన్నాడు.

నన్ను తన సోదరుడిలా భావించేవాడు

నన్ను తన సోదరుడిలా భావించేవాడు

'అంతర్జాతీయ క్రికెట్లో సుమారు 20 ఏళ్ల అనుభవం ఉన్న ఆటగాడిలా నెహ్రా ఫీలవ్వడు. నన్ను తన సోదరుడిలా భావించేవాడు. బ్యాట్స్‌మెన్‌ను ఎలా బోల్తా కొట్టించాలో చెప్పాడు. బంతిని ఎలా పట్టుకోవాలి.. బ్యాట్స్‌మెన్‌కు ఎలా వేయాలో చూపించాడు. బ్యాట్స్‌మెన్‌ ఫుట్‌వర్క్‌ను దగ్గరగా గమనించి బంతి లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను మార్చాలని సూచించాడు' అని సిరాజ్ తెలిపాడు.

 నా ఆట ఎంతో మెరుగుపడింది

నా ఆట ఎంతో మెరుగుపడింది

'దీంతో నా ఆట ఎంతో మెరుగుపడింది. అంతేకాదు బ్యాట్స్‌మెన్‌ మైండ్‌ను ఎలా చదవాలో కూడా నెహ్రా నేర్పించాడు' అని సిరాజ్‌ తెలిపాడు. ఇదిలా ఉంటే ఆశిష్ నెహ్రా బుధవారం తన సొంత మైదానమైన ఫిరోజ్ షా కోట్లా మైదానంలో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే.

 నా జీవితంలో మరిచిపోలేని రోజు

నా జీవితంలో మరిచిపోలేని రోజు

దీనిపై కూడా సిరాజ్ స్పందించాడు. 'బుధవారం జరగబోయే టీ20లో ఆడతానో లేదో నాకు తెలియదు. ఒకవేళ నాకు అవకాశం వస్తే అది నా జీవితంలో మరిచిపోలేని రోజు. ఎందుకంటే నా అభిమాన క్రికెటర్లు కోహ్లీ, నెహ్రాతో కలిసి ఒకేసారి ఆడతాను. లేదంటే నెహ్రాతో కలిసి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడే అవకాశం ఇక ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో నెహ్రా క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నాడు కదా' అని సిరాజ్ అన్నాడు.

Story first published: Wednesday, November 22, 2017, 11:30 [IST]
Other articles published on Nov 22, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+