For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand, 3rd ODI: రోహిత్ శర్మ హాఫ్‌ సెంచరీ

India vs New Zealand Live Score, 3rd ODI: Rohit Sharma hits half-century

హైదరాబాద్: మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 39వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.

మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ అతనికి చక్కటి సహకారం ఇస్తున్నాడు. కోహ్లీ కూడా హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఫ్రస్తుతం 25 ఓవర్లకు గాను టీమిండియా ఒక వికెట్ నష్టానికి 132 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(59), విరాట్ కోహ్లీ(42) పరుగులతో ఉన్నారు.

1
44082

భారత విజయానికి ఇంకా 112 పరుగులు కావాలి. అంతకముందు ఓపెనర్ శిఖర్ ధావన్(28) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. తొలి రెండు వ‌న్డేల‌లో రాణించిన టీమిండియా ఓపెన‌ర్ శిఖ‌ర్ ధ‌ావ‌న్ మూడో వ‌న్డేలో మాత్రం స్వ‌ల్ప స్కోరుకే వెనుదిరగడం విశేషం.

వరుసపెట్టి బౌండరీలు బాదుతున్న శిఖర్‌ ధావన్ దూకుడును ట్రెంట్ బౌల్ట్‌ అడ్డుకున్నాడు. బౌల్ట్ బౌలింగ్‌లో స్లిప్ ఫీల్డ‌ర్ టేల‌ర్‌కు క్యాచ్ ఇచ్చి ధ‌వ‌న్ వెనుదిరిగాడు. దీంతో భార‌త్ 39 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49 ఓవ‌ర్ల‌లో 243 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

దీంతో పర్యాటక జట్టైన టీమిండియాకు 244 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ(3/41), భువనేశ్వర్ కుమార్(2/46), హార్డిక్ పాండ్యా(2/45), యజువేంద్ర చాహల్(2/51) విజృంభించారు.

Story first published: Monday, January 28, 2019, 13:52 [IST]
Other articles published on Jan 28, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+