Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

3rd ODI: న్యూజిలాండ్ బ్యాటింగ్, ధోనికి విశ్రాంతి, తుది జట్టులోకి పాండ్యా

India vs New Zealand, Live Score 3rd ODI: New Zealand Elect To Bat, Hardik Pandya Returns To India XI

హైదరాబాద్: మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే సోమవారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన కోహ్లీసేన... హ్యాట్రిక్ విజయంతో సిరీస్‌ను ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.

మరోవైపు సొంతగడ్డపై పుంజుకోవాలని న్యూజిలాండ్ ఆశిస్తోంది. భారత్ తుది జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. తొడ కండాలు పట్టేయడంతో ధోనికి విశ్రాంతినిచ్చిన కెప్టెన్ కోహ్లీ అతని స్థానంలో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌ని తీసుకున్నాడు. ఇక గత రెండు వన్డేలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయిన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ స్థానంలో హార్దిక్ పాండ్యాకి అవకాశమిచ్చాడు.

1
44082

తుది జట్టులో హార్ధిక్ పాండ్యా

ఇటీవల బీసీసీఐ పాలకుల కమిటీ హార్దిక్ పాండ్యాపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసిన సంగతి తెలిసిందే. నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కివీస్‌ని 157 పరుగులకే కుప్పకూల్చి 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకున్న టీమిండియా.. మౌంట్‌ మాంగనుయ్‌‌లో జరిగిన రెండో వన్డేలోనూ 234కే ఆలౌట్ చేసి 90 పరుగుల తేడాతో గెలుపొందింది.

2-0 ఆధిక్యంలో టీమిండియా

దీంతో.. ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో కొనసాగుతుంది. మరోవైపు ఈ సిరిస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్. పని ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ విరాట్ కోహ్లీకి టీమిండియా సెలక్టర్లు మిగిలిన రెండు వన్డేలతో పాటు మూడు టీ20ల సిరీస్‌కు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.

జట్ల వివరాలు:

భారత జట్టు: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కోహ్లీ, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్, దినేశ్‌ కార్తిక్‌, హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌, మహమ్మద్‌ షమీ, యుజువేంద్ర చాహల్.

కివీస్‌ జట్టు: మార్టిన్‌ గప్తిల్‌, కొలిన్‌ మన్రో, కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌, టామ్ లాథమ్, హన్రీ నికోల్స్‌, మిచెల్‌, బ్రాస్‌వెల్‌, ఇష్‌ సోధీ, లాకీ, ట్రెంట్‌ బౌల్ట్‌.

Story first published: Monday, January 28, 2019, 7:44 [IST]
Other articles published on Jan 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+