2nd ODI: రోహిత్, ధావన్ హాఫ్ సెంచరీలు.. భారీ స్కోరు దిశగా భారత్

హైదరాబాద్: మౌంట్ మాంగనుయ్ వేదికగా న్యూజిలాండ్‌తో శనివారం ప్రారంభమైన రెండో వన్డేలో భారత ఓపెనర్లు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు చక్కటి శుభారంభం అందించారు.
ఓపెనర్లు రోహిత్ శర్మ (72), శిఖర్ ధావన్ (65) ఇద్దరు హాఫ్ సెంచరీలు చేసి భారత్ భారీ స్కోర్ దిశగా సాగేందుకు బాటలు వేశారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించడంతో పాటు వంద పరుగులకుపైగా భాగస్వామ్యం నెలకొల్పారు.
14వ సెంచరీ భాగస్వామ్యం
వీరిద్దరి మధ్య ఇది 14వ సెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం. వీరిద్దరూ వేగంగా ఆడడంతో భారత్ 18 ఓవర్లలోనే వంద పరుగుల మార్కును చేరుకుంది. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించిన వికెట్ మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం 23 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ కోల్పోకుండా 141 పరుగులు చేసింది.
1-0 ఆధిక్యంలో టీమిండియా
ఐదు వన్డేల సిరీస్‌లో నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించడంతో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో యువ ఆటగాడు శుభమాన్ గిల్‌కి వరుసగా రెండో వన్డేలోనూ నిరాశ తప్పలేదు.
రెండు మార్పులతో బరిలోకి దిగిన కివీస్
మరోవైపు న్యూజిలాండ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. స్పిన్నర్ శాంట్నర్ స్థానంలో ఇష్ సోధి, పేసర్ టిమ్ సౌథీ స్థానంలో గ్రాండ్‌హోమ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. రెండో వన్డేలోనూ అదే జోరుని కొనసాగించాలని కోహ్లీసేన భావిస్తుండగా.. సొంతగడ్డపై ఐదు వన్డేల సిరీస్‌లో పుంజుకోవాలని న్యూజిలాండ్ ఆశిస్తోంది.
జట్ల వివరాలు:
టీమిండియా: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అంబటి రాయుడు, ధోని(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, విజయ్ శంకర్, కుల్‌దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ.
న్యూజిలాండ్: మార్టిన్ గుప్తిల్, కాలిన్ మన్రో, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్, హన్రీ నికోలస్, కాలిన్ గ్రాంధోమ్, డోగ్ బ్రేస్‌వెల్, ఇష్ సోధీ, లాకీ ఫెర్గ్యూషన్, ట్రెంట్ బోల్ట్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications