Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IN vs NZ, 2nd ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

India vs New Zealand, Live Score 2nd ODI: India Win Toss, Opt To Bat vs New Zealand At Bay Oval

హైదరాబాద్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా శనివారం రెండో వన్డే ప్రారంభమైంది. రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో యువ ఆటగాడు శుభమాన్‌ గిల్‌కి వరుసగా రెండో వన్డేలోనూ నిరాశ తప్పలేదు.

మరోవైపు న్యూజిలాండ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. స్పిన్నర్ శాంట్నర్ స్థానంలో ఇష్ సోధి, పేసర్ టిమ్ సౌథీ స్థానంలో గ్రాండ్‌హోమ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. నేపియర్ వేదికగా గత బుధవారం ముగిసిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

1
44081

రెండో వన్డేలోనూ అదే జోరుని కొనసాగించాలని కోహ్లీసేన భావిస్తుండగా.. సొంతగడ్డపై ఐదు వన్డేల సిరీస్‌లో పుంజుకోవాలని న్యూజిలాండ్ ఆశిస్తోంది.

జట్ల వివరాలు:
టీమిండియా:
రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అంబటి రాయుడు, ధోని(వికెట్‌ కీపర్‌), కేదార్‌ జాదవ్‌, విజయ్ శంకర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహమ్మద్‌ షమీ.

న్యూజిలాండ్: మార్టిన్‌ గుప్తిల్‌, కాలిన్‌ మన్రో, కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), రాస్‌ టేలర్‌, టామ్‌ లాథమ్‌, హన్రీ నికోలస్‌, కాలిన్‌ గ్రాంధోమ్‌, డోగ్‌ బ్రేస్‌వెల్‌, ఇష్‌ సోధీ, లాకీ ఫెర్గ్యూషన్‌, ట్రెంట్‌ బోల్ట్‌.

Story first published: Saturday, January 26, 2019, 7:51 [IST]
Other articles published on Jan 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+