Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేపియర్: సూర్యూడు అడ్డుపడటంతో నిలిచిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్

India vs New Zealand, Live Score 1st ODI: Sunlight Hampers Batsmans View, Play Stops In Napier

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా నేపియర్ వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేకు సూర్యుడు అడ్డుపడ్డాడు. భోజన విరామం తర్వాత మైదానంలోకి వచ్చిన భారత బ్యాట్స్‌మెన్‌ అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలను తట్టుకోలేకపోయారు.

సూర్యుడి కిరణాలు సరిగ్గా బ్యాట్స్‌మన్ కళ్లలోకి పడటంతో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందులు తలెత్తాయి. సూర్యుడి కిరణాలు నేరుగా కళ్లలోకి పడటంతో బ్యాటింగ్ చేస్తున్న శిఖ‌ర్ ధావ‌న్ అంపైర్ల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో అంఫైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

1
44080

సూర్యుడి కారణంగా

సూర్యుడి కారణంగా మ్యాచ్‌ను నిలిపివేయడంతో అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అయితే, సూర్యుడి కారణంగా మ్యాచ్ నిలిచిపోవడం... ఇది మనకు కొత్తగా అనిపించినా.. ఈ క్రికెట్ మైదానంలో ఇలా జరగడం మామూలే అని అంటున్నారు. గతంలో సూపర్ స్మాష్ మ్యాచ్‌లకు కూడా ఇలాగే సూర్యుడు అడ్డుపడ్డాడు.

స్టేడియం నిర్మించిన

స్టేడియం నిర్మించిన తీరు సరిగా లేకపోవడం వల్లే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. కాగా, విరామం అనంతరం టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. పదో ఓవర్‌లో బ్రేస్‌వెల్‌ వేసిన రెండో బంతికి ఓపెనర్ రోహిత్‌ శర్మ గప్తిల్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

114 పరుగుల దూరంలో భారత్

దీంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా ఒక వికెట్‌ నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్‌(29), కెప్టెన్ విరాట్ కోహ్లీ(2) ఉన్నారు. టీమిండియా విజయానికి ఇంకా 114 పరుగులు చేయాలి. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 38 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది.

న్యూజిలాండ్ 157 ఆలౌట్

భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్(4/39), షమీ(3/19), చాహల్(2/43) సత్తాచాటడంతో న్యూజిలాండ్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(64) ఒక్కడే హాఫ్ సెంచరీతో ఫరవాలేదనిపించాడు. సొంత గడ్డపై అద్భుతమైన రికార్డు కలిగిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఈ మ్యాచ్‌లో చేతులెత్తేశారు.

Story first published: Wednesday, January 23, 2019, 12:53 [IST]
Other articles published on Jan 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+