న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్‌తో T20I series: కెప్టెన్ కోహ్లీ స్థానంలో రాహుల్?

India Vs New Zealand: KL Rahul likely to join Team India as Virat Kohlis replacement in T20I series

హైదరాబాద్: 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన ఈ ఇద్దరిపై ఉన్న సస్పెన్షన్‌‌ని ఎత్తివేస్తున్నట్లు బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో హార్దిక్‌ పాండ్యాతో పాటు కేఎల్ రాహుల్ కూడా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు మార్గం సుగుమమైంది.

<strong>Spectacular scoop!: స్టార్క్ బౌలింగ్‌లో డిక్వెల్లా స్కూప్ షాట్ (వీడియో)</strong>Spectacular scoop!: స్టార్క్ బౌలింగ్‌లో డిక్వెల్లా స్కూప్ షాట్ (వీడియో)

సస్పెన్షన్‌ ఎత్తివేతతో హార్దిక్‌ పాండ్యా ఇప్పటికే న్యూజిలాండ్‌ పర్యటనకు బయల్దేరాడు. మరోవైపు, న్యూజిలాండ్‌తో ఫిబ్రవరి 6 నుంచి జరిగే మూడు టీ20ల సిరీస్‌కి కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో కేఎల్ రాహుల్‌ని సెలక్టర్లు ఎంపిక చేయబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కోహ్లీ స్థానంలో కేఎల్ రాహుల్

కోహ్లీ స్థానంలో కేఎల్ రాహుల్

గత కొన్ని నెలలుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నందున పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విశ్రాంతి ఇచ్చినట్లు సెలెక్షన్ కమిటీ ఇటీవలే ప్రకటించింది. గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తోన్న కేఎల్ రాహుల్‌ని న్యూజిలాండ్ పర్యటన కోసం తొలుత సెలక్టర్లు ఎంపిక చేయలేదు.

కోహ్లీకి విశ్రాంతి

కోహ్లీకి విశ్రాంతి

అయితే, న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి వన్డే ముగిసిన తర్వాత కోహ్లీకి విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు ఆకస్మికంగా నిర్ణయించడంతో అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌కి అవకాశమివ్వాలని సెలక్టర్లు యోచిస్తున్నారు. గత కొంతకాలంగా టెస్టుల్లో ఓపెనర్‌గా వన్డే, టీ20ల్లో మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

శనివారం రెండో వన్డే

శనివారం రెండో వన్డే

శనివారం జట్టుతో కలవనున్న ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది. భారత్-న్యూజిలాండ్ మధ్య శనివారం ఉదయం 7.30 గంటలకు రెండో వన్డే మౌంట్ మాంగనుయ్‌లోని బే ఓవల్ స్టేడియంలో జరగనుంది. ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ భారత్‌-ఏ తరఫున ఆడనున్నాడు. ఇంగ్లాండ్‌ లయన్స్‌తో భారత్-ఏ జట్టు ఐదు వన్డేలు ఆడనుంది.

Story first published: Friday, January 25, 2019, 17:20 [IST]
Other articles published on Jan 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X