ఆ ఇద్దరినీ ఎదుర్కొవడం మాకు ఛాలెంజే: విలియమ్సన్
హైదరాబాద్: అక్టోబర్ 22 నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ సిరిస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే భారత్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ మీడియాతో మాట్లాడాడు.
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌ని ఎదుర్కోవడం కష్టమేనని ఈ సందర్భంగా కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. చైనామన్ బౌలర్లు చాలా అరుదుగా ఉంటారని, వారిని ఎదుర్కోవడం ఛాలెంజ్‌తో కూడుకున్నదని అన్నాడు.

కుల్దీప్ యాదవ్, చాహల్ చాలా నైపుణ్యమున్న బౌలర్లు
‘కుల్దీప్ యాదవ్, చాహల్ చాలా నైపుణ్యమున్న బౌలర్లు. ఈ ఏడాది ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంతో టీమిండియాకి ఎంపికయ్యారు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఈ ఇద్దరూ చక్కగా రాణిస్తున్నారు. వీరి బౌలింగ్‌ని ఎదుర్కోవడం కష్టమని మాకు తెలుసు. కానీ, మా బ్యాట్స్‌మెన్లు వారి జోరుకి కళ్లెం వేయగలరు' అని విలియమ్సన్ అన్నాడు.

అదే మాకు పెద్ద సవాల్
దీనికి తోడు ఇక్కడి పరిస్థితులను అందిపుచ్చుకోవడమే మాకు పెద్ద సవాల్ అని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు. ఇక, సీనియర్ బౌలర్లు అశ్విన్, జడేజాలు జట్టులో లేకపోవడంపై విలియమ్సన్ ప్రశ్నించగా వారు లేకపోవడం మాకు కూడా ఆశ్చర్యం కలిగించిందని అన్నాడు. కానీ భారత్‌లో ప్రతిభ కలిగిన క్రికెటర్లు ఉన్నారని అన్నాడు.

ప్రతి ఒక్కరూ అన్ని ఫార్మాట్‌లు ఆడటం కష్టమే
అంతేకాదు ప్రతి ఒక్కరూ అన్ని ఫార్మాట్‌లు ఆడటం కష్టమని, బిజీ షెడ్యూల్ వల్ల కొందరికి విశ్రాంతి ఇవ్వడం క్రికెట్‌లో సహజమేనని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు. ఇక ఆస్ట్రేలియా జట్టుపై కుల్దీప్ హ్యాట్రిక్ తీయడం తనను ఎంతగానో ఆకట్టుకుందని విలియమ్సన్ ప్రశంసించాడు.

3-2తో సిరిస్ చేజార్చుకోవడం నిరాశ పరిచింది
అయితే గతేడాది సిరిస్‌ను 3-2తో చేజార్చుకోవడం నిరాశ పరిచిందని, ఈ సారి మాత్రం అలా కాకూడదని తమ జట్టులోని ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపాడు. తమ జట్టులోని ఆటగాళ్లకు చాలా మంది ఇక్కడ ఆడిన అనుభవం ఉందని కూడా చెప్పాడు. చివర్లో కివీస్ కోచ్ మైక్ హెస్సన్ మాట్లాడాడు.

కివీస్ కోచ్ మైక్ హెస్సన్ ఇలా
'కుల్దీప్, చాహల్ బౌలింగ్‌ను ఐపీఎల్‌లో మా ఆటగాళ్లు చాలా మంది ఎదుర్కొన్నారు. కొందరు కుల్దీప్ సహచరులుగా అతని మణికట్టు విద్యను గమనించారు. మణికట్టు స్పిన్నర్లు ఎక్కువగా పరుగుల ఇచ్చే అవకాశం కల్పిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మేం విజయం సాధించినట్లే' అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications