Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final: అయ్యో బుమ్రా.. ఏది వేసుకోవాలో కూడా తెలియదా?

India vs New Zealand: Jasprit Bumrah makes big mistake in WTC Final 2021

సౌథాంప్ట‌న్‌: ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డ‌బ్ల్యూటీసీ) ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న ప‌రిస్థిలుల్లో మిగతా బౌలర్లు వికెట్లు తీస్తుంటే.. మనోడు మాత్రం వికెట్ కోసం అష్టకష్టాలు పడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ ముందు తేలిపోయిన బుమ్రా.. ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు. ఇది చాల‌ద‌న్న‌ట్లు ఐదో రోజు ఆట‌లో ఓ పెద్ద పొర‌పాటు చేశాడు.

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్ర‌త్యేకంగా త‌యారు చేయించిన జెర్సీ కాకుండా రెగ్యుల‌ర్ టీమిండియా జెర్సీతో జస్ప్రీత్ బుమ్రా బ‌రిలోకి దిగాడు. ఐదో రోజు త‌న తొలి ఓవ‌ర్ మొత్తం ఇదే జెర్సీతో బౌలింగ్ చేశాడు. త‌ర్వాత త‌ప్పు తెలుసుకున్న బుమ్రా.. ఓవ‌ర్ల మ‌ధ్య‌లో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి కొత్త జెర్సీ వేసుకొని వ‌చ్చాడు. ఏ ఐసీసీ ఈవెంట్ అయినా స‌రే ఆట‌గాళ్ల జెర్సీల‌పై దేశం పేరు మ‌ధ్య‌లో ఉంటుంది.. స్పాన్స‌ర్ పేరు కాదు. కావాలంటే స్లీవ్స్‌పై స్పాన్న‌ర్ పేరు ఉండొచ్చు. బుమ్రా వేసుకున్న జెర్సీ మ‌ధ్య‌లో భారత్ స్పాన్స‌ర్ పేరు ఉంది.

ప‌రిమితి ఓవ‌ర్ల ప్రపంచకప్‌ల‌లో ఇలాంటి పొర‌పాటు జ‌ర‌గ‌డం దాదాపు అసాధ్యం. కానీ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ తొలిసారి జ‌రుగుతుండ‌టంతో జస్ప్రీత్ బుమ్రా మ‌ర‌చిపోయిన‌ట్లున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు బుమ్రాను ఓ ఆటాడుకుంటున్నారు. 'అయ్యో బుమ్రా.. ఏ జెర్సీ వేసుకోవాలో కూడా తెలియదా?' అని ఒకరు కామెంట్ చేయగా.. 'బుమ్రా పెద్ద బ్లండ‌ర్‌ ఇది' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆరో రోజుకు చేరుకుంది. వర్షం కారణంగా ఐదు రోజుల్లో పూర్తి ఆట సాధ్యం కాలేదు. ఫలితంగా ముందే ప్రకటించిన రిజర్వు డే వినియోగిస్తున్నట్టు ఐసీసీ తెలిపింది. రిజర్వు డే మొత్తం గరిష్ఠ వ్యవధి కనీసం 330 నిమిషాలు లేదా 83 ఓవర్లు వేయాలి. దాంతో పాటు ఆఖరున గంట సమయం ఉంటుంది. సాధారణ విరామాలు కాకుండా ఆట ఆరంభానికి ముందే అంతరాయం ఏర్పడితే అంతమేరకు చివరిలో పొడిగించొచ్చు. అదీ అందుబాటులో ఉన్న సమయం మేరకే.

Story first published: Wednesday, June 23, 2021, 14:26 [IST]
Other articles published on Jun 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+