India vs New Zealand: 4వ వన్డేలో కోహ్లీ స్థానంలో శుభమాన్ గిల్!

హైదరాబాద్: శుభ్‌మాన్ గిల్... న్యూజిలాండ్ పర్యటన కోసం తొలిసారిగా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే తొలి మూడు వన్డేల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇప్పటికే ఐదు వన్డేల సిరిస్‌ని 3-0తో టీమిండియా చేజిక్కించుకోవడం... కెప్టెన్ కోహ్లీకి మిగతా రెండు వన్డేలకు దూరం కావడంతో జట్టు మేనేజ్‌మెంట్ ప్రయోగాలకు సిద్ధమైంది.
ఇందులో భాగంగా ఈ సిరిస్‌లో మిగతా రెండు వన్డేల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో అండర్-19 స్టార్ ప్లేయర్ శుభమాన్ గిల్‌కి చోటివ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఈ సిరిస్‌లో నాలుగో వన్డే హామిల్టన్ వేదికగా గురువారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

కోహ్లీ స్థానంలో గిల్ ఎంపిక
కోహ్లీ చివరి రెండు వన్డేలకు దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో గిల్‌ను ఎంపిక చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడా ఇదే మాట చెప్పాడు. తుది జట్టులో చోటుకు గిల్ అర్హుడని గంగూలీ చెప్పాడు. దీంతో గురువారం నాలుగో వన్డేలో అతనికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ
కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో మిగతా రెండు వన్డేలతో పాటు మూడు టీ20ల సిరిస్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నాడు. భారత పేసర్లు భువనేశ్వర్, మహ్మద్ షమీలో ఒకరికి లేదా ఇద్దరికీ విశ్రాంతినిచ్చి.. ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్‌కి మరో అవకాశం ఇవ్వడంపై కూడా టీమిండియా మేనేజ్‌మెంట్ చర్చిస్తోంది.

రాహుల్ స్థానంలో
న్యూజిలాండ్ గడ్డపై గతేడాది జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో మెరుపులు మెరిపించిన శుభమాన్ గిల్ భారత్-ఎ జట్టు తరఫున కూడా నిలకడగా రాణించాడు. ఇటీవలే నిషేధానికి గురైన కేఎల్ రాహుల్ స్థానంలో శుభమాన్ గిల్‌ను న్యూజిలాండ్ పర్యటనకి సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications