వెల్లింగ్టన్ టెస్ట్: విజృంభించిన జేమీసన్, సౌతీ.. 165 పరుగులు భారత్ ఆలౌట్!!

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను టీమిండియా పేలవంగా ఆరంభించింది. అరంగేట్ర పేసర్ కైల్ జేమీసన్ ( (4/39)), సీనియర్ పేసర్ టీమ్ సౌతీ (4/49)) విజృంభించడంతో వెల్లింగ్టన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌట్ అయింది. అనుకూలిస్తున్న పిచ్‌పై పేస్ కివీస్ బౌలర్‌లు చెలరేగడంతో రెండో రోజు మరో 43 పరుగులు చేసిన టీమిండియా.. 68.1 ఓవర్లలో మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. అజింక్య రహానె (46; 138 బంతుల్లో 5×4) టాప్ స్కోరర్.
ఓవర్ నైట్ స్కోర్ 122/5తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. రిషబ్ పంత్ (19) అనవసర పరుగు కోసం ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ఇదే సమయంలో టీమ్ సౌతీ తన అనుభవాన్ని ఉపయోగించాడు. కొద్ది వ్యవధిలోనే ఆర్ అశ్విన్ (0), రహానెలను ఔట్ చేసాడు. ఇక ఇషాంత్ శర్మ (5)ను జేమీసన్ వెనక్కి పంపాడు.ఆ వెంటనే మొహమ్మద్ షమీ (21)ని సౌతీ ఔట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. చివరలో షమీ పోరాడంతో భారత్ ఆ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది.
తొలి రోజు( శుక్రవారం) భారీ వర్షం వల్ల ఆట త్వరగా ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 122 పరుగులకే ఐదు వికెట్లు చేజార్చుకుంది. మయాంక్ అగర్వాల్ 34 పరుగులు చేయగా.. పృథ్వీ షా (16), చేటేశ్వర్ పుజారా (11), కెప్టెన్ విరాట్ కోహ్లీ (2), హనుమ విహారి (7) విఫలమయ్యారు.వర్షం వల్ల మొదటి రోజు టీ తర్వాతి సెషన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే.
టీమిండియా ఆలౌట్ అనంతరం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ ఆచితూచి ఆడుతోంది. ఓపెనర్లు టామ్ బ్లండెల్, టామ్ లాతమ్ భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఈ జోడి బౌండరీల జోలికి పోకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు. ఇదే పిచ్‌పై కివీస్ బౌలర్లు చెలరేగితే.. భారత బౌలర్లు మాత్రం చేతులెత్తేస్తున్నారు. లంచ్ సమయానికి కివీస్ 8 ఓవర్లలో 17 పరుగులు చేసింది. క్రీజులో బ్లండెల్ (6), లాతమ్ (11) ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications