Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఊరించి ఊసూరుమనిపించారు: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు

India vs New Zealand, ICC Cricket World Cup 2019 Match in Nottingham: Game Called Off Due to Rain

హైదరాబాద్: టీమిండియా అభిమానులకు చేదువార్త. నాటింగ్‌హామ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైంది. ఉదయం నుంచి వర్షం దోబూచులాడుతుండటంతో తొలుత టాస్‌ను వాయిదా వేశారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఒక దశలో వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ జరుగుతుందని భావించిన అభిమానులకు నిరాశ తప్పలేదు. వర్షం ఆగినట్లే ఆగి మళ్లీ కురుస్తుండటంతో చివరకు మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అంపైర్లు మ్యాచ్‌ని రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.

అంఫైర్ మాట్లాడుతూ

అంఫైర్ మాట్లాడుతూ "ఇలా జరగడం చాలా దురదృష్టకరం. గ్రౌండ్ స్టాఫ్ చాలా కష్టపడ్డారు. కానీ గత 48 గంటలుగా వాతావరణం ప్రతీకూలంగా ఉండటంతో వాళ్ల కష్టం వృధా అయింది. వాతావరణం ఎలా ఉంటుందో మనం ఊహించలేం. కానీ, ఆదివారం భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్‌కి వాతావరణం అనుకూలించాలని కోరుకుంటున్నాం" అని అన్నాడు.

వర్షం కారణంగా రద్దైన నాలుగో మ్యాచ్ ఇది

ఈ వరల్డ్‌కప్‌లో వర్షం కారణంగా రద్దైన నాలుగో మ్యాచ్ ఇది. అందులో రెండు శ్రీలంక మ్యాచ్‌లే కావడం విశేషం. బ్రిస్టల్‌లో శ్రీలంకతో పాకిస్థాన్‌ మ్యాచ్‌ రద్దయింది. సోమవారం దక్షిణాఫ్రికా-విండిస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 7.3 ఓవర్ల అనంతరం వర్షం ఆటంకం కలిగించింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన దక్షిణాఫ్రికా.. సోమవారం విండీస్‌తో మ్యాచ్‌ ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో

వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో

ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ని నిలిపివేశారు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంఫైర్లు మ్యాచ్‌ని రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. నాలుగు మ్యాచ్‌లాడిన దక్షిణాఫ్రికా ఒక పాయింటుతో ఖాతా తెరిచింది. తాజాగా, మంగళవారం బంగ్లాదేశ్‌-శ్రీలంక మ్యాచ్‌ ఒక్క బంతి పడకుండానే రద్దు అయింది. ఈ వరల్డ్‌కప్‌లో వర్షం కారణంగా మ్యాచ్‌ల రద్దు ప్రభావం శ్రీలంక, పాక్‌, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై పడింది.

5 పాయింట్లతో మూడో స్థానంలో భారత్

5 పాయింట్లతో మూడో స్థానంలో భారత్

దీంతో 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు టీమిండియా 5 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లీసేన అజేయంగా దూసుకుపోతోంది. ఇప్పటికే భారత్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మీద గెలిచిన భారత్ గురువారం న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంది.

జూన్ 16న పాకిస్థాన్‌తో మ్యాచ్

జూన్ 16న పాకిస్థాన్‌తో మ్యాచ్

అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా టీమిండియా జూన్ 16న తదుపరి మ్యాచ్‌లో దాయాది దేశమైన పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జరగనుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌పైనే నెలకొంది.

Story first published: Thursday, June 13, 2019, 20:04 [IST]
Other articles published on Jun 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+