For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నెహ్రా ఫేర్‌వెల్ మ్యాచ్: పాండ్య కళ్లు చెదిరే క్యాచ్‌ (వీడియో)

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

By Nageshwara Rao

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పయి 202 పరుగులు చేసింది.

India vs New Zealand: Hardik Pandya’s flying catch is among the best you will ever see; watch it

అనంతరం భారత్ నిర్దేశించిన 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. యజువేంద్ర చాహల్‌ వేసిన 1.3వ బంతికి గుప్టిల్ (4) అవుటయ్యాడు. లాంగాఫ్‌లో పరుగెత్తుకు వచ్చిన పాండ్యా గాల్లోకి అద్భుతంగా డైవ్‌ చేసి బంతిని ఒడిసి పట్టాడు.

దీంతో ఆరు పరుగుల వద్దే కివీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అయితే, పాండ్యా ఈ క్యాచ్‌ పట్టిన తీరు చూసి క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో చూసిన అభిమానులు పాండ్యాని 'సూపర్ మ్యాన్'తో పోల్చుతున్నారు.

మరోవైపు ఈ మ్యాచ్‌లో పాండ్య పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. సోధి వేసిన ఇన్నింగ్స్ 16.2వ బంతికి ఓపెనర్ ధావన్ స్టంపౌట్‌ కాగా, అనంతరం క్రీజులోకి వచ్చిన పాండ్యా.... అదే ఓవర్‌ నాలుగో బంతికి డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్లో ఓ ఓవర్‌ వేసిన పాండ్యా 11 పరుగులిచ్చి విలియమ్సన్‌ వికెట్‌ తీశాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శనివారం 4న రాజ్‌కోట్ వేదికగా జరగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+