ND vs NZ: ఆ భారత ఆటగాడు 10 మార్కులకు 9 సాధించాడు.. మున్ముందు మాయ చేస్తాడు: గ్రేమ్ స్వాన్

లండన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. గైక్వాడ్ ఆటకు ఫిదా అయ్యానని, ఐపీఎల్‌లో తాను చూసిన మంచి ఇన్నింగ్స్‌ల్లో అతడు ఆడినవి కొన్ని ఉన్నాయన్నాడు. భవిష్యత్తులో గైక్వాడ్ మంచి ఆటగాడిగా మారబోతున్నాడని మైక్ హస్సీ కొన్నేళ్ల కిందటే తనతో చెప్పాడని గ్రేమ్ స్వాన్ వెల్లడించాడు. ఐపీఎల్ 2021లో గైక్వాడ్ పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. మెగా లీగ్‌లో అతడు అత్యధిక పరుగులు (635) చేసిన ఆటగాడిగా నిలిచి.. చెన్నై నాలుగోసారి ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. దాంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

సెంచరీ చేయడం ఓ సంచలనం:
ఐపీఎల్ 2021 ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని బీసీసీఐ సెలెక్టర్లు రుతురాజ్ గైక్వాడ్‌ను న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కి ఎంపిక చేశారు. అయితే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ఓపెనర్లు జట్టులో ఉండడంతో గైక్వాడ్‌కు తుది జట్టులో ఆడే అవకాశం రావడం కాస్త కష్టమే అనే చెప్పాలి. అందుకే న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో గైక్వాడ్ ఆడుతుంటే చూడాలని ఉందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. క్రికెట్.కామ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్వాన్ మాట్లాడుతూ... 'చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ ప్రత్యేకమైనవాడు. ఐపీఎల్‌లో నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో అతడు ఆడినవి కొన్ని ఉన్నాయి. అబుదాబిలో గైక్వాడ్ సెంచరీ చేయడం ఓ సంచలనం. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు అతడు ఎంపికైనందుకు సంతోషిస్తున్నా' అని అన్నాడు.

మున్ముందు గైక్వాడ్ మాయ చేస్తాడు:
'రుతురాజ్ గైక్వాడ్ ఒక సంపూర్ణమైన ఆటగాడిగా మారబోతున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ మైక్ హస్సీ నాతో కొన్నేళ్ల క్రితం చెప్పాడు. అతడిని చూస్తూ ఉండండి.. మున్ముందు మాయ చేస్తాడు. గైక్వాడ్ ఇప్పటికే 10 మార్కులకు గాను 9 మార్కులు సాధించాడు. ఇంకా రాటుదేలుతున్నాడు. 10 మార్కులకు 10 సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు' అని ఇంగ్లీష్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2020లో చెన్నై విఫలమయిన సంగతి తెలిసిందే. అయితే గైక్వాడ్ మాత్రం ఆకట్టుకున్నాడు. వరుస హాఫ్ సెంచరీలు బాది తానేంటో నిరూపించుకున్నాడు. ఆ ప్రదర్శన కారణంగా ఐపీఎల్ 2021లో తుది జట్టులో చోటు దక్కించుకుని పరుగుల సునామి సృష్టించాడు. ఈ క్రమంలోనే చెన్నై జట్టుకు టైటిల్ అందించాడు.

అయ్యర్ 10 మార్కులు అందుకోగలడు
:ఇప్పటివరకు తన కెరీర్‌లో నిలకడగా ఫామ్‌లో లేని ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడు తానెంటో నిరూపించుకోవాల్సి ఉందని గ్రేమ్ స్వాన్ అన్నాడు. 'శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తుంటే చూడటం అద్భుతంగా ఉంటుంది. కానీ అతడు నిలకడగా మంచి ప్రదర్శనలు చేయలేదు. కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఉన్నా.. మరికొన్ని బలహీనమైన ప్రదర్శనలూ ఉన్నాయి. నేనైతే శ్రేయస్ ఆటకు ఎనిమిది మార్కులు వేస్తా. కానీ అయ్యర్ సులభంగా 10 మార్కులు అందుకోగలడు' అని స్వాన్ చెప్పుకొచ్చాడు. గాయాల కారణంగా అయ్యర్ ఇటీవలి కాలంలో పెద్దగా క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్ 2021కు ముందు కోలుకుని ఆ టోర్నీలో ఆడినా.. పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయినా అతడిపై నమ్మకం ఉంచిన బీసీసీఐ సెలెక్టర్లు న్యూజిలాండ్‌తో సిరీసుకు ఎంపికచేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications