Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కారణమిదీ: కివీస్ స్వింగ్ దెబ్బకు టీమిండియా టాపార్డర్ కుదేలు

India vs New Zealand: Praveen Kumar Analysis Of Top Order Failure In 4th And 5th ODI'S
India vs New Zealand: Former Indian pacer Praveen Kumar explains why Indian batsmen struggle against swing

హైదరాబాద్: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా బ్యాట్స్‌మెన్‌ దారుణ వైఫల్యానికి కారణం స్వింగ్‌ను ఎదుర్కోకపోవడమేనని భారత మాజీ పేసర్‌ ప్రవీణ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డాడు. ఉపఖండ ఫ్లాట్‌ పిచ్‌లపై ఆడిన భారత ఆటగాళ్లకు స్వింగ్‌ పిచ్‌లపై ఆడటం కష్టంగా మారిందని అన్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా వరుసగా మూడు వన్డేల్లో ఘన విజయం సాధించి 3-0తో సిరిస్‌ను సొంతం చేసుకుంది. అయితే, నాలుగో వన్డేలో చెత్త ప్రదర్శన చేసింది. బ్యాట్స్‌మెన్‌ ఘోరంగా విఫలం కావడంతో92 పరుగులకే కుప్పకూలింది.

వెల్లింగ్టన్ వేదికగా

వెల్లింగ్టన్ వేదికగా

వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం ప్రారంభమైన నాలుగో వన్డేలో సైతం భారత టాపార్టర్ విఫలమైంది. దీంతో ఆఖరి వన్డేలో కూడా భారత్ తక్కువ స్కోరుకే ఆలౌటైందని అంతా భావించారు. అయితే... అంబటి రాయుడు, విజయ్‌ శంకర్‌ల 98 పరుగల భాగస్వామ్యానికి తోడు చివర్లో పాండ్యా మెరుపులు మెరిపించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది.

ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ

ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ "బ్యాట్స్‌మెన్‌ వైఫల్యానికి ప్రధాన కారణం.. మన ఆటగాళ్లు ఎక్కువగా ఫ్లాట్‌ పిచ్‌లపై ఆడటం. దీంతో బ్యాట్స్‌మెన్‌ బంతి స్వింగ్‌ అయినప్పుడు అంతే వేగంతో వారి ఫుట్‌వర్క్‌ను మార్చుకోలేకపోతున్నారు. ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ల్లో మన బ్యాట్స్‌మెన్‌ స్వింగ్‌ ఎదుర్కోకపోవడానికి ఇదే ప్రధాన కారణం. స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ భయాందోళనకు గురవుతున్నారు" అని చెప్పుకొచ్చాడు.

స్వింగ్‌ దెబ్బకు టీమిండియా టాపార్డర్ కుదేలు

స్వింగ్‌ దెబ్బకు టీమిండియా టాపార్డర్ కుదేలు

నాలుగు, ఐదు వన్డేల్లో న్యూజిలాండ్‌ పేస్‌ ద్వయం ట్రెంట్‌ బౌల్ట్‌, హెన్రీలు భారత బ్యాట్స్‌మెన్‌ను స్వింగ్‌తో ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. నాలుగో వన్డేలో ట్రెంట్‌ బౌల్ట్‌ ఏకంగా 5 వికెట్లతో చెలరేగగా... చివరి వన్డేలో హెన్రీ 4 వికెట్లు పడగొట్టాడు. వీరి స్వింగ్‌ దెబ్బకు టీమిండియా టాపార్డర్ కుదలైంది.

1
44084
Story first published: Sunday, February 3, 2019, 15:26 [IST]
Other articles published on Feb 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+