న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand: దినేశ్ కార్తీక్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ చూశారా? (వీడియో)

India vs New Zealand : Dinesh Karthik’s Exceptional Catch To Dismiss Mitchell At Wellington
India vs New Zealand: Dinesh Karthik makes up for dropped catch with stunner

హైదరాబాద్: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ సూపర్ క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ అందుకోవడంతో పాటు సిక్స్‌ను కూడా అడ్డుకున్నాడు. బౌండరీ లైన్‌ వద్ద దినేశ్ కార్తీక్‌ పట్టిన ఈ క్యాచ్‌కి మైదానంలోని ఆటగాళ్లు, అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్ జట్టుని బ్యాటింగ్‌ను ఆహ్వానించాడు.

పాండ్యా వేసిన 16వ ఓవర్‌ చివరి బంతిని

న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో హార్దిక్‌ పాండ్యా వేసిన 16వ ఓవర్‌ చివరి బంతిని కివీస్‌ అరంగేట్ర ఆటగాడు డెరిల్‌ మిచెల్ అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. ఆ దిశలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న దినేష్‌ కార్తీక్‌ బంతిని చాకచక్యంగా అందుకున్నాడు. అయితే సమన్వయం కోల్పోతున్నట్లు భావించిన కార్తీక్‌ వెంటనే బంతిని గాల్లోకి విసిరి ఆ తర్వాత మళ్లీ బౌండరీ లైన్ దాటివచ్చి అందుకున్నాడు.

దినేశ్ కార్తీక్ సూపర్ క్యాచ్

బంతి అందుకునే సమయంలో.. విడిచే సమయంలో మళ్లీ అందుకునే సమయంలో అతను బౌండరీ లైన్‌ను తాకలేదని సమీక్షలో స్పష్టం కావడంతో థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టిమ్ సీఫర్ట్ (84: 43 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.

భారత టార్గెట్ 220 పరుగులు

దీంతో టీమిండియాకు 220 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా (51/2), కృనాల్ పాండ్య (37/1), చాహల్ (35/1), భువనేశ్వర్ (47/1), ఖలీల్ అహ్మద్ (48/1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 14 సిక్సర్లు, 14 ఫోర్లు నమోదయ్యాయి. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో కేన్ విలియమ్సన్ (34: 22 బంతుల్లో 3 ఫోర్లు) రాణించగా, చివర్లో రాస్ టేలర్ (23: 14 బంతుల్లో 2 సిక్సులు) మెరుపులు మెరిపించాడు.

1
44085
Story first published: Wednesday, February 6, 2019, 14:44 [IST]
Other articles published on Feb 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X