Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final Day 2: రెండో రోజూ ఎలా ఉండొచ్చు...గంటగంటకూ మారుతోన్న సౌథాంప్టన్ వెదర్...!

India vs New Zealand Day 2 Weather Forecast: Will It Rain The Next Day In WTC FInal

లండన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ తొలిరోజు కథ కంచికి చేరినట్టే. టాస్ వేయాలనే మాట అటుంచితే..కనీసం గ్రౌండ్‌లో అడుగు పెట్టడానికి కూడా వీల్లేని పరిస్థితులక్కడ ఏర్పడ్డాయి. కాలం గడుస్తున్న కొద్దీ వరుణదేవుడు విజృంభిస్తోన్నాడే తప్ప కనికరించే ఛాన్సే లేదు. కాలం గడుస్తున్న కొద్దీ గ్రౌండ్ బురదమయమౌతోంది. పిచ్ డ్యామేజ్ కాకుండా దాన్ని కప్పి ఉంచినా.. అవుట్ ఫీల్డ్ మొత్తం బురదమయమైంది. అక్కడక్కడా వర్షపు నీళ్లు నిలిచాయి.

వాస్తవానికి- భారత కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం 2 గంటలకు టాస్ వేయాల్సి ఉంటుంది. ఆ గడువుకు రెండు గంటల ముందు కూడా సౌథాంప్టన్‌లో వర్షం పడుతూనే ఉంది. మధ్యలో కాస్త విరామం ఇస్తోన్నప్పటికీ.. అది పూర్తిస్థాయిలో ఉండట్లేదు. ఆకాశం ఇంకా మేఘావృతమై ఉంది. వర్షం పడకపోయినప్పటికీ.. వెలుతురు లేమి మ్యాచ్‌ ఆరంభానికి అడ్డు పడదనడానికి గ్యారంటీ లేకుండా పోయింది. ఈ పరిస్థితుల మధ్య తొలిరోజు ఆట దాదాపుగా వర్షార్పణమైనట్టే.

బ్రిటన్ వాతావరణ శాఖ అధికారుల అంచనాల ప్రకారం.. ఆ దేశ కాలమానం ప్రకారం.. ఉదయం 10 గంటలకు వర్షం పడటానికి 80 శాతం మేర అవకాశం ఉంది. అదే 12 గంటలకు అది మరింత పెరిగింది. 90 శాతానికి చేరింది. ఇక సెకెండ్ సెషన్ సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నా మ్యాచ్ ప్రారంభం కాలేదు. మధ్యాహ్నం 2 గంటలకు వర్షం పడటానికి 90 శాతం మేర అవకాశాలు ఉన్నట్లు బ్రిటన్ మెట్రొలాజికల్ డిపార్ట్‌మెంట్ అంచనా వేసింది. సాయంత్రం 5 గంటలకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రిడిక్ట్ చేసింది.

5 గంటల సమయంలో వర్షం పడటానికి 80 శాతం మేర అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసినట్లు తెలిపింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తొలి రోజు ఆట ఆరంభం కావడం దాదాపు అసాధ్యం. రెండో రోజును పరిగణనలోకి తీసుకుంటే.. సౌథాంప్టన్‌లో దాదాపుగా ఇదే వాతావరణం ఉంటుందని బ్రిటన్ మెట్రొలాజికల్ డిపార్ట్‌మెంట్ అభిప్రాయపడింది. వచ్చే 72 గంటలపాటు వర్షం కురవడానికి అవకాశం ఉన్నట్లు ఇదివరకే తేల్చి చెప్పారా విభాగం అధికారులు.

రెండో రోజు 98 ఓవర్ల పాటు మ్యాచ్ కొనసాగొచ్చని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అంచనా వేసింది. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్నప్పటికీ.. వర్షం ఆగిపోతే- మ్యాచ్‌ను ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. మూడో రోజు 50 నుంచి 70, నాలుగో రోజు 30 నుంచి 50 ఓవర్లు పడేలా వాతావరణం అనుకూలిస్తుందని పేర్కొంది. రిజర్వ్ డే కూడా కలుపుకొని ఆరు రోజుల పాటు ఈ ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించడానికి ఐసీసీ సమాయాత్తమౌతోంది.

Story first published: Friday, June 18, 2021, 12:00 [IST]
Other articles published on Jun 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+