Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

400 వికెట్లు: ఈడెన్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన అశ్విన్

కోల్‌కత్తా: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అశ్విన్ 400వికెట్లు తీసుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ వికెట్ తీసుకోవడంతో అశ్విన్ ఈ రికార్డుని సొంతం చేసుకున్నాడు.

ఇప్పటి వరకు 185 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లాడిన అశ్విన్ 400 వికెట్లు తీసుకున్నాడు. కాగా అశ్విన్ మొత్తం 38 టెస్టుల్లో 25.06 యావ‌రేజ్‌తో 206 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో టెస్టుల్లో ఐదేసి వికెట్లు 19 సార్లు తీసుకున్నాడు. ఇక టెస్టుల్లో 66 పరుగులిచ్చి 7 వికెట్లు తీయడం అశ్విన్ అత్యుత్తమ ప్రదర్శన.

India Vs New Zealand: Ashwin completes 400 wickets in international cricket

ఇక 102 వ‌న్డేలు ఆడిన అశ్విన్ 31.73 స‌గ‌టుతో మొత్తం 142 వికెట్లు తీశాడు. వ‌న్డేల్లో 25 ప‌రుగులిచ్చి నాలుగు వికెట్లు తీయ‌డం అశ్విన్ అత్యుత్తమ ప్రదర్శన. 45 టీ20 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ అందులో 52 వికెట్లు తీశాడు. ఇలా అన్ని ఫార్మాట్లలో కలిపి అశ్విన్ 400 వికెట్లు తీసుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+