For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్‌తో వన్డే సిరిస్: జాదవ్‌కు వరం, రైనాకు శాపం

By Nageshwara Rao

మొహాలి: భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన యువ ఆటగాళ్లకు ఓ వరంలా మారిందా? అంటే అవుననే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి జూనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశం ఇచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అయితే తమకు అందివచ్చిన అవకాశాల్ని యువ ఆటగాళ్లు చక్కగా అందిపుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సిరిస్‌లో యువ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రిత్ బూమ్రాలు ఎంతో కీలకంగా మారి భారత జట్టులో తమ స్ధానాన్ని సుస్థిరం చేసుకునేలా ఉన్నారు.

ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే యువ క్రికెటర్ మనీశ్ పాండే కూడా చక్కగా రాణిస్తున్నాడు. దీంతో జట్టులో చోటు కోసం ఎదురచూస్తున్న వెటరన్స్‌కు ఎదురు చూపులు తప్పడం లేదు. జ్వరం కారణంగా తొలి మూడు వన్డేలకు సురేశ్ రైనా దూరం కావడం.. ఊహించని విధంగా అతని స్ధానంలో జట్టులోకి వచ్చిన కేదార్ జాదవ్ కూడా అద్భుత ప్రదర్శన ఇస్తున్నాడు.

India vs New Zealand: Accidental bowler Kedar Jadhav making it count

రంజీల్లో మహారాష్ట్రకు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. ఇప్పటివరకు పది అంతర్జాతీయ వన్డేలాడిన కేదార్ జాదవ్ 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత వన్డే జట్టులో అరంగేట్రం చేశాడు. అయితే ఆ తర్వాత ఆశించిన మేరకు అవకాశాలు రాలేదు.

తొలుత వికెట్ కీపర్‌ బ్యాట్స్‌మన్ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. అందులో భాగంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వికెట్ కీపర్‌గా మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా రాణిస్తున్నాడు.

న్యూజిలాండ్ సిరిస్‌లో జట్టులోకి వచ్చిన జాదవ్ అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ చక్కగా రాణిస్తున్నాడు. ఆదివారం మొహాలితో ముగిసిన మూడో వన్డేతో కలిపి జాదవ్ మొత్తం ఆరు వికెట్లు తీసుకున్నాడు. తొలి వన్డేలో జాదవ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

ఢిల్లీలో జరిగిన రెండో వన్డేలో 11 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు. ఇక మొహాలిలో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్‌కు చెందిన కీలక ఆటగాళ్ల వికెట్లు తీసి మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. 12 ఓవర్లకు గాను ఒక వికెట్ కోల్పోయి 73 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న కివీస్ కెప్టెన్ విలియమ్సన్‌తో పాటు టేలర్, లాంథమ్‌లను ఔట్ చేసి కివీస్ పరుగులకు బ్రేక్ వేశాడు.

ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే తొలి వన్డేలో 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రెండో వన్డేలో 41 పరుగులు చేశాడు. మూడో వన్డేలో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మూడో వన్డే అనంతరం జాదవ్ మాట్లాడాడు. తన బౌలింగ్‌ని ఎదుర్కొనేందుకు బ్యాట్స్‌మెన్ ఇబ్బందులు పడుతున్నట్లు అభిప్రాయపడ్డాడు. ఫేస్‌ని కూడా ఛేంజ్ చేశానని చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+