Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs New Zealand, 5th ODI: భారత్‌ను ఆదుకున్న రాయుడు-శంకర్

India Vs New Zealand : 91 Runs Partnership Change That The Match Will Turn To India
 India vs New Zealand, 5th ODI: Ambati Rayudu, Vijay Shankar Build On For India After Four Early Wickets

హైదరాబాద్: న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం ప్రారంభమైన ఆఖరి వన్డేలో టీమిండియా నిలకడగా ఆడుతోంది. 30 ఓవర్లు పూర్తి చేసుకున్న టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. క్రీజులో విజయ్‌ శంకర్‌(41), అంబటి రాయుడు(41) నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని వందకు దాటించారు.

ఈ క్రమంలో వీరిద్దరూ కలిస 91 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీకి చేరువయ్యారు. అంతకముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కివీస్‌ పేసర్లు హెన్రీ, బౌల్ట్‌లు విజృంభించడంతో టీమిండియా 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

స్వల్ప స్కోర్లకే భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ(2), శిఖర్‌ ధావన్‌ (6) పెవిలియన్‌కు చేరగా.... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌(7), ధోని(1) సైతం పెవిలియన్‌కు చేరారు. ఈ మ్యాచ్‌లో దోనిని బౌల్ట్ బౌల్డ్ చేశాడు. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే నాలుగు వన్డేలు ముగియగా ప్రస్తుతం 3-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా గెలుపుతో సిరీస్‌ని ముగించాలని ఉవ్విళ్లూరుతోంది.

1
44084

మరోవైపు గత గురువారం జరిగిన నాలుగో వన్డేలో అనూహ్యంగా విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్ జట్టు సొంతగడ్డపై ఆఖరి వన్డేలో గెలిచి 2-3తో పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. భారత్ తుది జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. తొడ కండరాల గాయం కారణంగా మూడు, నాలుగు వన్డేలకి దూరమైన ధోని ఫిట్‌నెస్ సాధించడంతో మళ్లీ తుది జట్టులోకి వచ్చాడు.

దీంతో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ రిజర్వ్ బెంచ్‌కి పరిమితమవగా.. ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో మహ్మద్ షమీ, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. గాయపడిన ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ స్థానంలో కొలిన్ మున్రో జట్టులోకి వచ్చాడు.

Story first published: Sunday, February 3, 2019, 10:24 [IST]
Other articles published on Feb 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+