India vs New Zealand 4th T20I Highlights: మరో సూపర్ ఓవర్ సాగిందిలా!

హైదరాబాద్: మరో సూపర్ ఓవర్ న్యూజిలాండ్ జట్టుకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ సిరీస్‌లో వరుసగా రెండోసారి సూపర్ ఓవర్ ఆడటం జరిగింది. అచ్చం మూడో టీ20ని తలపించే విధంగా నాలుగో టీ20లో కూడా టైగా ముగిసింది.
దీంతో మ్యాచ్ మరొకసారి ఉత్కంఠ భరితంగా మారింది. అయితే, సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్ 14 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, దాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. దీంతో ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఫలితంగా ఐదు టీ20ల సిరిస్‌లో టీమిండియా 4-0 ఆధిక్యంలో నిలిచింది.
ఐదో టీ20 ఆదివారం
ఇరు జట్ల మధ్య ఐదో టీ20 ఆదివారం మౌంట్ మాంగనూయి వేదికగా జరగనుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 165 పరుగులు చేయగా, న్యూజిలాండ్ కూడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 165 పరుగులే చేసింది. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన తరుణంలో కివీస్ ఒక పరుగు మాత్రమే చేసి శాంట్నర్ వికెట్‌ను కోల్పోయింది.
మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్
దీంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఆడించారు. సూపర్ ఓవర్‌లో విజయం కోహ్లీసేననే వరించింది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా వికెట్ కోల్పోయి ఓ బంతి మిగిలి ఉండగానే 16 పరుగులు చేయడంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.

నాలుగో టీ20లో సూపర్ ఓవర్ సాగిందిలా
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫెర్ట్-మున్రోలు ఇన్నింగ్స్ ఆరంభించగా, భారత బౌలర్ బుమ్రా సూపర్ ఓవర్ వేశాడు.
తొలి బంతి(సీఫెర్ట్ - 2 పరుగులు)
రెండో బంతి(సీఫెర్ట్ - ఫోర్)
మూడో బంతి( సీఫెర్ట్ - 2 పరుగులు)
నాలుగో బంతి( సీఫెర్ట్ ఔట్)
ఐదో బంతి(మున్రో - ఫోర్)
ఆరో బంతి(మున్రో -1 పరుగు)

టీమిండియా ఇన్నింగ్స్
కేఎల్ రాహుల్-కోహ్లీలు ఇన్నింగ్స్ ఆరంభించగా, కివీస్ బౌలర్ టిమ్ సౌథీ సూపర్ ఓవర్ వేశాడు.
తొలి బంతి(కేఎల్ రాహుల్ - 6 పరుగులు)
రెండో బంతి(కేఎల్ రాహుల్- 4 పరుగులు)
మూడో బంతి(కేఎల్ రాహుల్ ఔట్)
నాల్గో బంతి(కోహ్లీ - 2 పరుగులు)
ఐదో బంతి(కోహ్లీ -ఫోర్‌తో విజయం)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications