India vs New Zealand, 4th ODI: 35 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్

హైదరాబాద్: హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 36 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 16 ఓవర్లకు గాను టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజులో హార్థిక్ పాండ్యా(4), భువనేశ్వర్(1) పరుగులతో ఉన్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ధావన్ (13) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా.. రోహిత్ శర్మ(6) రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

23 పరుగులకే ఓపెనర్లను
దీంతో 23 పరుగులకే టీమిండియా ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అనంతరం రాయుడు(0), కార్తీక్(0)లు గ్రాండ్ హోమ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగారు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన శుభమాన్ గిల్(9) కూడా
పూర్తిగా నిరాశ పరిచాడు. ఆ తర్వాత కేదార్ జాదవ్(1) కూడా బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

టాస్ గెలిచిన న్యూజిలాండ్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. జట్టులోకి కోహ్లీ స్థానంలో యువ క్రికెటర్ శుభమాన్ గిల్ వచ్చాడు. తొడ కండరాల గాయం కారణంగా మూడో వన్డేకి దూరమైన ధోని ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో నాలుగో వన్డేలోనూ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

షమీ ప్లేస్‌లో ఖలీల్ అహ్మద్
దీంతో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్ కొనసాగనున్నాడు. పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతిని ఇచ్చి ఖలీల్ అహ్మద్‌కు అవకాశం కల్పించారు. ఐదు వన్డేల సిరీస్‌లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన టీమిండియా ఇప్పటికే 3-0తో సిరీస్‌ని కైవసం చేసుకోగా.. మిగిలిన రెండు వన్డేలోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
రోహిత్‌కు 200వ వన్డే
మరోవైపు కనీసం చివరి వన్డేల్లోనైనా గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని న్యూజిలాండ్ ఆశిస్తోంది. ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో అతని స్థానంలో రోహిత్ శర్మ జట్టు పగ్గాలను అందుకున్నాడు. రోహిత్ శర్మకు ఇది 200వ వన్డే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications