4th ODI: విజృంభించిన కివీస్ బౌలర్లు.. టీమిండియా 92 ఆలౌట్


హైదరాబాద్: హామిల్టన్ వేదికగా గురువారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రారంభమైన నాలుగో వన్డేలో కివీస్ బౌలర్లు విజృంభించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లేని టీమిండియా న్యూజిలాండ్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ (5/21), గ్రాండ్‌హోమ్ (3/26) ఒక ఆట ఆడుకున్నారు.
ఈ మ్యాచ్‌లో బౌల్ట్ దెబ్బకు భారత్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 30.5 ఓవర్లలో కేవలం 92 పరుగులకే కుప్పకూలిపోయింది. ఫలితంగా తొమ్మిదేళ్ల ఆనంతరం అత్యల్ప స్కోరుకు ఆలౌటై ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

54 పరుగులే ఇప్పటివరకు అత్యల్ప స్కోరు
అది కూడా 2010లో దంబుల్లా వేదికగా న్యూజిలాండ్(88) పైనే ఈ రికార్డు ఉండటం విశేషం. ఇక, ఇప్పటివరకు శ్రీలంక(2000)పై 54 పరుగులే ఇప్పటివరకు అత్యల్ప స్కోరు కావడం విశేషం. భారత జట్టులో ఆరుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవగా.. ఇందులో ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ డకౌట్‌గా వెనుదిరిగారు.

టాప్ స్కోరర్‌గా యజువేంద్ర చాహల్
చివర్లో బ్యాట్‌తో రాణించిన చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ (18 నాటౌట్: 37 బంతుల్లో 3 ఫోర్లు)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వగా, తొడ కండరాల గాయం కారణంగా ధోని ఈ మ్యాచ్‌కి దూరమైన సంగతి తెలిసిందే. తన కెరీర్‌లో 200వ వన్డే ఆడుతున్న రోహిత్‌కు హామిల్టన్ చేదు అనుభవాన్ని మిగిల్చింది.

3-0తో సిరీస్‌ని కైవసం చేసుకున్న భారత్
ఐదు వన్డేల సిరీస్‌లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన టీమిండియా ఇప్పటికే 3-0తో సిరీస్‌ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ధావన్ (13) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా.. రోహిత్ శర్మ(6) రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

నిరాశపరిచిన టీమిండియా ఓపెనర్లు
దీంతో 23 పరుగులకే టీమిండియా ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అనంతరం రాయుడు(0), కార్తీక్(0)లు గ్రాండ్ హోమ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగారు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన శుభమాన్ గిల్(9) కూడా
పూర్తిగా నిరాశ పరిచాడు. ఆ తర్వాత కేదార్ జాదవ్(1) కూడా బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
5 వికెట్లు తీసిన ట్రెంట్ బౌల్ట్
మొదటి మూడు వన్డేల్లో పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిండియా నాలుగో వన్డేలో మాత్రం చేతులెత్తేసింది. స్వింగ్, బౌన్స్, సీమ్ అధికంగా ఉండడంతో భారత బ్యాట్స్‌మెన్ కివీస్ బౌలర్లను ఎదుర్కొనడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా క్రీజ్ వద్ద నిలవలేకపోయారు. బౌల్ట్ పది ఓవర్లలో 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications