India vs New Zealand, 4th ODI: ధోని దూరం... కోహ్లీ స్థానంలో గిల్ అరంగేట్రం

హైదరాబాద్: హామిల్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. జట్టులోకి కోహ్లీ స్థానంలో యువ క్రికెటర్ శుభమాన్ గిల్ వచ్చాడు.
తొడ కండరాల గాయం కారణంగా మూడో వన్డేకి దూరమైన ధోని ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో నాలుగో వన్డేలోనూ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీంతో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్ కొనసాగనున్నాడు. పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతిని ఇచ్చి ఖలీల్ అహ్మద్‌కు అవకాశం కల్పించారు.
ఐదు వన్డేల సిరీస్‌లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన టీమిండియా ఇప్పటికే 3-0తో సిరీస్‌ని కైవసం చేసుకోగా.. మిగిలిన రెండు వన్డేలోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు కనీసం చివరి వన్డేల్లోనైనా గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని న్యూజిలాండ్ ఆశిస్తోంది.
ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో అతని స్థానంలో రోహిత్ శర్మ జట్టు పగ్గాలను అందుకున్నాడు. రోహిత్ శర్మకు ఇది 200వ వన్డే.
జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్‌దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, ఖలీల్ అహ్మద్
న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, హన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథమ్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, కోలిన్ గ్రాండ్‌హోమ్, టాడ్ ఆస్టిల్, మాట్ హన్రీ, ట్రెంట్ బౌల్ట్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications