మూడో టీ20: అరుదైన రికార్డు సృష్టించనున్న విరాట్ కోహ్లీ
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో రెండు వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న తొలి భారత క్రికెటర్‌గా నిలిచేందుకు కోహ్లీ అత్యంత దగ్గరగా ఉన్నాడు. టీ20ల్లో కోహ్లీకి రెండు వేల పరుగులు మైలురాయిని అందుకునేందుకు ఇంకా 57 పరుగులు కావాల్సి ఉంది.
తిరువనంతపురం వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మూడో టీ20లో విరాట్ కోహ్లీ 57 పరుగులు చేస్తే రెండు వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ప్రస్తుతం టీ20ల్లో విరాట్ కోహ్లీ 1943 పరుగులు చేశారు. మొత్తంగా చూస్తే టీ20ల్లో రెండు వేల పరుగుల చేసిన ఏకైక క్రికెటర్‌గా కివీస్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ ఉన్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో మెకల్లమ్ చేసిన పరుగులు 2140. ఆ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. రాజ్ కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో విరాట్ కోహ్లీ పలు రికార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రెండో టీ20లో 200 ఫోర్ల క్లబ్‌లో చేరిన కోహ్లీ, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల్ని సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.
ఇదిలా ఉంటే తిరువనంతపురం వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ని 8 ఓవర్లకు కుదించారు. నలుగురు బౌలర్లు రెండు ఓవర్ల చొప్పున వేయొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications