IND vs NZ, 3rd T20I: ఓపెనర్‌గా పదివేల పరుగులు: సచిన్ రికార్డుని అధిగమించిన రోహిత్

హైదరాబాద్: హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా 10,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కేవలం 219 ఇన్నింగ్స్‌ల్లో 50కిపైగా యావరేజితో ఈ మైలురాయిని అందుకున్న ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డుని రోహిత్ శర్మ అధిగమించాడు. ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ 48.07 యావరేజితో 342 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో 15335 పరుగులు చేశాడు.
ఫలితంగా అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో క్రికెటర్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్ రోహిత్ శర్మ అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసాడు. ఇక ఇది రోహిత్‌కు 24వది కావడం విశేషం. దీంతో టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా సారథి విరాట్ కోహ్లి సరసన రోహిత్ చేరాడు.
కివీస్ పేసర్ హామిష్ బెన్నట్ వేసిన ఆరో ఓవర్లో రోహిత్ వీరవిహారం చేసాడు. ఆరో ఓవర్లో ఏకంగా 27 పరుగులు పిండుకున్నాడు. బెన్నెట్ వేసిన ఆరో ఓవర్ మొదటి బంతికి లోకేష్ రాహుల్ సింగల్ తీసి రోహిత్ శర్మకు స్ట్రైక్ ఇచ్చాడు. రోహిత్ వరుసగా 6,6,4,4, 6 బాదాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 27 పరుగులు వచ్చాయి.
ఫలితంగా మూడు ఫార్మాట్లలో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మట్లలో కలిపి పది వేల పరుగులు సాధించిన నాలుగో టీమిండియా ఓపెనర్‌గా రోహిత్ మరో ఘనత సాధించాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో ఓపెనర్ రోహిత్ కావడం విశేషం. అయితే, హాఫ్ సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 94 పరుగుల వద్ద రోహిత్ శర్మ (40 బంతుల్లో 65, 6 ఫోర్లు, 3 సిక్సులు) ఔటయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications