India vs New Zealand, 3rd T20I: కివీస్ ఓపెనర్లను ఔట్ చేసిన శార్ధూల్, జడేజా

హైదరాబాద్: హామిల్టన్‌లోని సెడాన్ పార్కులో టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. న్యూజిలాండ్ ఓపెనర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. జట్టు స్కోరు 47 పరుగుల వద్ద శార్దూల్ ఠాకూర్ వేసిన ఆరో ఓవర్ నాలుగో బంతికి ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
మార్టిన్ గుప్టిల్ 21 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 31 పరుగులు చేశాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ కొలిన్ మున్రో(14) స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్ వేసిన ఏడో ఓవర్ రెండో బంతికి మున్రో స్టంపౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. 52 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది.
టీమిండియా నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ జట్టు 10 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్సన్(18), మిచెల్ శాంట్నర్(9) పరుగులతో ఉన్నారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.
Story first published: Wednesday, January 29, 2020, 15:28 [IST]
Other articles published on Jan 29, 2020
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications