Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మూడో టీ20లో భారత్ ఓటమి: 2-1తో సిరిస్ న్యూజిలాండ్ కైవసం

 India vs New Zealand 3rd T20I Highlights: India Fall Agonisingly Short As New Zealand Claim Series 2-1

హైదరాబాద్: హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా పోరాడి ఓడిపోయింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. దీంతో మూడో టీ20లో భారత క్రికెట్ జట్టు 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాంతో న్యూజిలాండ్‌లో తొలిసారి టీ20 సిరీస్‌ సాధించాలనుకున్న భారత్‌ ఆశలు తీరలేదు. మూడు టీ20ల సిరిస్‌ను న్యూజిలాండ్ 2-1తో కైవసం చేసుకుంది.

213 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్ శిఖర్‌ ధావన్‌(5) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా.... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్‌ శంకర్‌‌(43: 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి మరో ఓపెనర్ రోహిత్ శర్మ (38;32 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.

141 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ ఔట్

141 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ ఔట్

దూకుడుగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 141 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ నాలుగో వికెట్‌గా ఔటైన కొద్దిసేపటికే హార్దిక్‌, ధోని(2)లు కూడా నిష్ర్రమించడంతో స్కోరులో వేగం తగ్గింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్‌ పంత్‌(28: 12 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా(21: 11 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు)లు రాణించారు.

కొలిన్ మున్రోకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

కొలిన్ మున్రోకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

చివర్లో దినేశ్‌ కార్తీక్‌(33 నాటౌట్‌; 16 బంతుల్లో 4 సిక్సర్లు) చెలరేగి ఆడినప్పటికీ టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్, శాంటర్న్ చెరో రెండు వికెట్లు తీసుకోగా... టిక్నర్, స్కాట్ చెరో వికెట్ పడగొట్టారు. ఆఖరి టీ20లో 72 పరుగులతో రాణించిన కొలిన్ మున్రోకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

భారత టార్గెట్ 213

భారత టార్గెట్ 213

అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్లు టీమ్‌ సీఫెర్ట్‌ (43;25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కొలిన్ మున్రో (72: 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చక్కటి శుభారంభాన్నిచ్చారు.

తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం

తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం

వీరిద్దరూ తొలి వికెట్‌కు 80 పరుగులు జత చేసిన తర్వాత సీఫెర్ట్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విలియమ్సన్‌తో కలిసి మున్రో స్కోరు బోర్డును నడిపించాడు. ఈ క్రమంలోనే ఇరువురు 55 పరుగులు జత చేసిన తర్వాత మున్రో రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

మూడో వికెట్‌గా విలియమ్సన్ ఔట్

మూడో వికెట్‌గా విలియమ్సన్ ఔట్

ఆ తర్వాత మరో 15 పరుగుల వ్యవధిలో విలియమ్సన్‌(27) కూడా ఔట్‌ కావడంతో న్యూజిలాండ్ జట్టు స్కోరు 150 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన గ్రాండ్‌హోమ్‌(30;16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), డార్లీ మిచెల్‌(19 నాటౌట్; 11 బంతుల్లో 3 ఫోర్లు‌), రాస్‌ టేలర్‌(14 నాటౌట్‌; 7 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) ఫరవాలేదనిపించారు.

రెండు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్

రెండు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్

ముఖ్యంగా చివర్లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించారు. భారత బౌలర్లలో చాహల్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ (2/26) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు ఓపెనర్లు మున్రో, సీఫర్ట్ వికెట్లను పడగొట్టాడు. ఇక, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌లకు తలో వికెట్‌ తీసుకున్నారు.

Story first published: Sunday, February 10, 2019, 16:36 [IST]
Other articles published on Feb 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+