Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. అయ్యర్‌, రాహుల్ నెలకొల్పిన రికార్డులు ఇవే!!

India Vs New Zealand 3rd ODI: Shreyas Iyer, KL Rahul achieves impressive feat at Bay Oval

మౌంట్‌ మాంగనూయ్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ లోకేష్ రాహుల్ సెంచరీ (113 బంతుల్లో 112; ఫోర్లు 9, సిక్సులు 2), శ్రేయస్‌ అయ్యర్‌ (63 బంతుల్లో 62; ఫోర్లు 9)లు రాణించారు. స్టైలిష్‌ ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ తీవ్ర ఒత్తిడిలోనూ ఆత్మవిశ్వాసంతో, ఎంతో పరిణతితో బ్యాటింగ్‌ చేశాడు. ఇక కీలక సమయంలో శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత ఆటతో హాఫ్ సెంచరీ చేసాడు. ఈ జోడి రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది.

అయ్యర్‌ అరుదైన రికార్డు:

అయ్యర్‌ అరుదైన రికార్డు:

అర్ధ సెంచరీ సాధించే క్రమంలో శ్రేయస్‌ అయ్యర్‌ వన్డేల్లో ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 10 కన్నా ఎక్కువ మ్యాచ్‌లలో అత్యధిక హాఫ్‌ సెంచరీల సగటు సాధించిన ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. 16 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్‌ 9 అర్ధ సెంచరీలు చేశాడు. ఫలితంగా అత్యధిక హాఫ్‌ సెంచరీల సగటు 56.25 సగటు నమోదు చేశాడు.

చాపెల్‌ 16 మ్యాచ్‌లలో 8:

చాపెల్‌ 16 మ్యాచ్‌లలో 8:

శ్రేయస్‌ అయ్యర్‌ తర్వాతి స్థానాల్లో ఇయాన్‌ చాపెల్‌ 16 మ్యాచ్‌లలో 8, ఆకిబ్ ఇలియాస్ 10 మ్యాచ్‌లలో 5 హాఫ్‌ సెంచరీలు (సగటు 50)తో ఉన్నారు. అన్షుమన్‌ రథ్‌ 18 మ్యాచ్‌లలో 8 -సగటు 44.44, డేర్‌ డస్సన్‌ 16 మ్యాచ్‌లలో 7 -సగటు 43.75, టెన్‌ డోషెట్‌ 32 మ్యాచ్‌లలో14 -సగటు 43.75తో మిగతా స్థానాల్లో ఉన్నారు.

రెండో బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ రికార్డు:

రెండో బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ రికార్డు:

సెంచరీ చేయడంతో కేఎల్ రాహుల్ కూడా ఓ రికార్డును నమోదు చేశాడు. కివీస్ గడ్డపై 5వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ రికార్డు సృష్టించాడు. 2015 వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సీనియర్ ఆటగాడు సురేష్ రైనా (110) సెంచరీ చేసి తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు.

వీరి భాగస్వామ్యమే హైలెట్‌:

వీరి భాగస్వామ్యమే హైలెట్‌:

ఆరంభంలో భారత్‌ను గట్టి దెబ్బ కొట్టిన న్యూజిలాండ్‌ బౌలర్లు మధ్య ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌ జోరును అడ్డుకోలేకపోయారు. భారత ఇన్నింగ్స్‌లో రాహుల్‌, శ్రేయస్‌ భాగస్వామ్యమే హైలెట్‌. 62/3తో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కివీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు చేసారు. ఈ జోడి నాలుగో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

Story first published: Tuesday, February 11, 2020, 12:59 [IST]
Other articles published on Feb 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+