For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రా మ్యాజిక్: కాన్పూర్ వన్డేలో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ, 2-1తో సిరిస్ కైవసం

సిరిస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే ఆరంభమైంది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలో ఆడిన ఇరు జట్లే బరిలోకి దిగుతున్నాయి.

By Nageshwara Rao

హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌ను భారత్ గెలుచుకుంది. కాన్పూర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరిస్‌ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. ఈ సిరిస్ విజయం భారత్‌కు వరుసగా ఏడో సిరిస్ విజయం కావడం విశేషం.

338 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభంలో దూకుడుగా ఆడినప్పటికీ చివర్లో తడబడింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. చివరి ఓవర్లో 15 పరుగులు సాధించాల్సిన దశలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేసి 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

బుమ్రా ఇన్నింగ్స్ 47 ఓవర్లో ధోనితో చక్కటి సమన్వయంతో లాథమ్ (65)ను రనౌట్ చేయడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. వాస్తవానికి కివీస్ జట్టు 40 ఓవర్లలో 247/3తో పటిష్టంగా కనిపించింది. లాథమ్ క్రీజులో ఉన్నంత సేపు భారత్ విజయానికి దూరంగా ఉండిపోయింది.

చివర్లో కివిస్ విజయానికి 13 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో అతడు రనౌట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్‌లో బుమ్రా మ్యాజిక్ చేయడంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.


న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సాగిందిలా:

లాథమ్ హాఫ్ సెంచరీ
కాన్పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న ముూడో వన్డే ఉత్కంఠ భరితంగా మారింది. భారత్‌ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యాన్ని నిలకడగా ఛేదిస్తోంది. 45 ఓవర్లు ముగిసే సరికి 288/4తో నిలిచింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ టామ్‌ లేథమ్‌ (60) ఒత్తిడిలో కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. హెన్రీ నికోల్స్‌ (23) అతడికి సహకారం అందిస్తున్నాడు. కివీస్ విజయానికి 30 బంతుల్లో 50 పరుగులు కావాలి.

అనూహ్యాంగా రాస్ టేలర్‌ ఔట్‌
టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. రాస్‌ టేలర్‌ (39) అనూహ్యంగా అవుటయ్యాడు. 40.1వ బంతి వేసిన బుమ్రా టేలర్‌ను పెవిలియన్‌కు పంపించి మ్యాచ్‌ను మరింత రసవత్తరంగా మార్చేశాడు. రాస్ టేలర్ అవుటైన తర్వాత హెన్రీ నికోల్స్‌ (1) క్రీజులోకి వచ్చాడు. 41 ఓవర్లు ముగిసే సరికి కివీస్‌ 4 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. కివీస్ గెలవాలంటే 54 బంతుల్లో 90 పరుగులు చేయాల్సి ఉంది.

విలియమ్సన్ ఔట్: మూడో వికెట్ కోల్పోయిన కివీస్
కాన్పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ మూడో వికెట్‌ కోల్పోయింది. భారత్ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ జట్టు స్కోరు 44 పరుగుల వద్ద మార్టిన్ గుప్టిల్ (10)ను కోల్పోయింది. ఆ తర్వాత బరిలోకి దిగిన కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో కలిసి మున్రో భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు.

 New Zealand win the toss and elect to field

62 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు చేసి చాహల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కాసేపటికే దాటిగా ఆడుతున్న కెప్టెన్ విలియమ్సన్ కూడా చాహల్ బౌలింగ్‌లోనే కీపర్ ధోనీకి క్యాచ్ పెవిలియన్ చేరాడు. విలియమ్సన్ 84 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. ప్రస్తుతం 29 ఓవర్లు పూర్తయ్యే సరికి మూడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రాస్ టేలర్ 9, లాథమ్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.

కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ
భారత్ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ దూకుడుగా ఆడుతోంది. 23 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోయి 143 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన కేన్‌ విలియమ్సన్‌ 58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

 New Zealand win the toss and elect to field


కివీస్ ఓపెనర్‌ మన్రో హాఫ్ సెంచరీ
భారత్ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ దూకుడుగా ఆడుతోంది. ఈ క్రమంలో మన్రో హాఫ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 39 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్సర్లతో 51 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు మంచు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ విలియమ్సన్‌ (32) అతడికి పూర్తి సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి కివీస్ వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది. విలియమ్సన్ 37, మున్రో 56 పరుగులతో క్రీజులో ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న కివీస్
భారత్ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ దూకుడుగా ఆడుతోంది. భువీ వేసిన తొలి ఓవర్‌లోనే 19 పరుగులు రాబట్టింది. రెండో బంతికి గుప్టిల్ సింగిల్‌ తీయగా మూడో బంతిని మన్రో సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత మూడు బంతుల్లో వరుసగా మూడు బౌండరీలు బాదేశాడు. ఇక, ఐదు ఓవర్లు ముగిసే సరికి కివీస్‌ వికెట్‌ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. కొలిన్‌ మన్రో (29), మార్టిన్‌ గప్తిల్‌ (10) క్రీజులో ఉన్నారు.


కివీస్ లక్ష్యం 338

కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ చెలరేగారు. ఓపెనర్ రోహిత్ శర్మ (147), కెప్టెన్ కోహ్లీ (113) చెలరేగి ఆడటంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్‌కు 338 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్ గెలిచిన న్యూజిలాండ్ భారత్‌కు బ్యాటింగ్ ఆహ్వానించింది. జట్టు స్కోరు 29 పరగుల వద్ద శిఖర్ ధావన్ (14)ను ఔట్ చేసిన ఆనందం కివీస్ బౌలర్లకు ఎక్కువ సేపు నిలవలేదు. కోహ్లీ, రోహిత్ శర్మలు న్యూజిలాండ్ బౌలర్లను ఆటాడుకున్నారు. 138 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 18 ఫోర్లు, 2 సిక్సర్లతో 147 పరుగులు చేసి అవుటయ్యాడు.

ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ 106 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో వన్డేల్లో 32వ సెంచరీ నమోదు చేశాడు. దీనితో పాటు వన్డేల్లో అతి తక్కువ మ్యాచుల్లో 9వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగానూ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అనంతరం హార్ధిక్ పాండ్యా 8, ధోనీ 25, కేదార్ జాదవ్ 18, దినేశ్ కార్తీక్ 4(నాటౌట్) పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, ఆడం మిల్నె, మిచెల్ సాంట్నర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.


భారత్ బ్యాటింగ్ తీరు సాగిందిలా:

ఐదో వికెట్ కోల్పోయిన భారత్
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 331 పరుగుల వద్ద ధోని (25) రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ధోని అవుటైన తర్వాత క్రీజులోకి దినేశ్ కార్తీక్ వచ్చాడు. ప్రస్తుతం 49.1 ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేసింది. క్రీజులో జాదవ్ 8, కార్తీక్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.

కోహ్లీ (113) ఔట్: నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 113 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ కోహ్లీ అవుటయ్యాడు. దీంతో 47 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసింది. కోహ్లీ అవుటైన తర్వాత కేదార్ జాదవ్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం ధోని 18 పరుగులు చేయగా, జాదవ్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

పాండ్యా (8) ఔట్: మూడో వికెట్ కోల్పోయిన భారత్
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 273 పరుగుల వద్ద పాండ్యా (8) మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో టిమ్ సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. పాండ్యా అవుటైన తర్వాత క్రీజులోకి ధోని వచ్చాడు. ప్రస్తుతం 45 ఓవర్లకు గాను టీమిండియా 3 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ధోని 7, కోహ్లీ 104 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Pandya

32వ సెంచరీ: 96 బంతుల్లో 100 పరుగులు చేసిన కోహ్లీ
మూడో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ చెలరేగుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో 32 సెంచరీ నమోదు చేశాడు. 96 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. 203 వన్డేలోనే ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. ప్రస్తుతం 43.1 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా సాగుతోంది.

రోహిత్ శర్మ ఔట్: రెండో వికెట్ కోల్పోయిన భారత్
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 147 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. శాంట్నర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రోహిత్ శర్మ (147) పరుగుల వద్ద సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ అవుటైన తర్వాత క్రీజులోకి పాండ్యా వచ్చాడు. ప్రస్తుతం 42 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. కోహ్లీ 97, హార్ధిక్ పాండ్యా 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

35 ఓవర్లకు భారత్ స్కోరు 196/1
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్నారు. రోహిత్ ఇప్పటికే సెంచరీ చేయగా, కోహ్లీ కూడా సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం 35 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 196 పరుగులు చేసింది. కోహ్లీ 69, రోహిత్ శర్మ 109 పరుగులతో క్రీజులో ఉన్నారు.

వన్డేల్లో 15వ సెంచరీ చేసిన రోహిత్ శర్మ
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ చెలరేగుతున్నాడు. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీ నమోదు చేశాడు. 106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్ శర్మ సెంచరీని నమోదు చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 15వ సెంచరీ కావడం విశేషం. మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ కూడా వన్డేల్లో 46వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ 100, కోహ్లీ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఈ ఏడాది 1000 పరుగులు చేసిన రోహిత్ శర్మ
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌ బ్యాట్స్‌మెన్ చెలరేగుతున్నారు. 25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టానికి 134 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (74) మరో రికార్డు సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఈ ఏడాది 1000 పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు. విరాట్‌ కోహ్లీ (43) 1385 పరుగులతో అతని కన్నా ముందు ఉన్నాడు. 2013 తర్వాత రోహిత్‌ శర్మ 1000 పరుగులు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

21 ఓవర్లకు భారత్ స్కోరు 116/1
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం 21 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 116 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 29 పరుగుల వద్ద శిఖర్ ధవన్ (14) వికెట్‌ను కోల్పోయింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కావడంతో భారత బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు.
ప్రస్తుతం రోహిత్ శర్మ 69, కోహ్లీ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు.

వన్డేల్లో 46వ హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 59 బంతుల్లో 4 ఫోర్లు సాయంతో విరాట్ కోహ్లీ 50 పరుగులు పూర్తి చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 46వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. దీంతో 30 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టానికి 165 పరుగులు చేసింది.

కాన్పూర్ వన్డే: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 52 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. డి గ్రాండ్‌హోమ్‌ వేసిన 16.4వ బంతికి సింగిల్‌ తీసి కెరీర్‌లో 35వ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తొలి రెండు వన్డేల్లో విఫలమైన రోహిత్‌ ఈ మ్యాచ్‌లో తనదైన శైలిలో ఆడుతున్నాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 35వ హాఫ్ సెంచరీ. దీంతో 17 ఓవర్లకు గాను భారత్ ఒక వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 24, రోహిత్ శర్మ 51 పరుగులతో క్రీజులో ఉన్నారు.

హాఫ్ సెంచరీకి చేరువలో రోహిత్ శర్మ
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ క్రికెటర్లు నిలకడగా ఆడుతున్నారు. 14 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 17, రోహిత్ శర్మ 44 పరుగులతో ఉన్నారు. అంతకముందు ఓపెనర్ శిఖర్ ధావన్ (14) పరుగుల వద్ద అవుటయ్యాడు.

ధావన్ ఔట్: తొలి వికెట్ కోల్పోయిన భారత్
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 29 పరుగుల వద్ద ధావన్ (14) టిమ్ సౌథీ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ధావన్ అవుటైన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. దీంతో 7 ఓవర్లకు గాను టీమిండియా ఒక వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 4, రోహిత్ శర్మ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.



టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

సిరిస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే ఆరంభమైంది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలో ఆడిన జట్లే ఈ మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగుతున్నాయి. మూడు వన్డేల సిరిస్‌లో ఇరు జట్లు చెరొకటి విజయం సాధించడంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన విజయం సాధిస్తే వరుసగా ఏడో సిరిస్‌ను గెలిచినట్లవుతుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు మూడు.. ఆ తర్వాత మూడు సిరిస్‌లను గెలవడంతో వరుసగా ఆరు సిరీస్‌లను గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పుడు ఏడో సిరీస్ విజయంపై కన్నేసింది.

ఇరు జట్లు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయి. తొలి వన్డేలో లాథమ్, టేలర్ ఇచ్చిన షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత రెండో వన్డేలో టీమిండియా దానికి ప్రతీకారం తీర్చుకుంది. మిడిలార్డర్ వైఫల్యంతో ఇబ్బందిపడుతున్న కోహ్లీసేనకు ఇప్పుడు దినేశ్ కార్తీక్ రూపంలో ఓ ప్రత్యామ్నాయం లభించింది.

అతన్ని నాలుగోస్థానంలోనే కొనసాగించాలని కెప్టెన్ భావిస్తున్నాడు. కాబట్టి తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

జట్ల వివరాలు:
భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధవన్, దినేశ్, జాదవ్, ధోనీ, పాండ్యా, భువనేశ్వర్, అక్షర్, చాహల్, బుమ్రా.
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గుప్టిల్, మున్రో, టేలర్, లాథమ్, నికోలస్, గ్రాండ్‌హోమీ, సాంట్నెర్, మిల్నే, బౌల్ట్, సౌతీ.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+