Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్.. జాదవ్ ఔట్.. పాండే ఇన్!!

India Vs New Zealand 3rd ODI: New Zealand have won the toss and have opted to field

మౌంట్‌ మాంగనూయ్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌, భారత్‌ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్‌ మరికొద్దిసేపట్లో మౌంట్‌ మాంగనూయ్‌లో ప్రారంభం కానుంది. ఈ వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ వన్డే కోసం భారత్ ఒక మార్పులతో బరిలోకి దిగుతోంది. వరుసగా విఫలమవుతున్న కేదార్ జాదవ్ స్థానంలో మనీష్ పాండే ఆడుతున్నాడు.

మరోవైపు కివీస్ రెండు మార్పులు చేసింది. విలియమ్సన్‌ జట్టు పగ్గాలు చేపట్టాడు. భుజం గాయంతో కేన్ టీ20 సిరీస్‌లోని ఆఖ‌రి రెండు మ్యాచ్‌ల‌తో పాటు వ‌న్డే సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక మార్క్ చాప్మన్ స్థానంలో మిచెల్ సాంట్నర్ వచ్చాడు.

1989లో వెస్టిండీస్‌ చేతిలో వైట్‌వాష్‌కు గురైన తర్వాత.. మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌ల్లో భారత్‌ అన్ని మ్యాచ్‌లు ఓడలేదు. మరి ఈ రికార్డును నిలుపుకుంటూ.. టెస్టు సిరీస్‌కు ముందు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలంటే చివరి వన్డేలో విరాట్‌ సేన విజృంభించాల్సి ఉంటుంది.

మౌంట్‌ మాంగనూయ్‌లో పరుగుల వరద ఖాయం. పిచ్‌ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది. చివరి ఐదు వన్డేల్లో స్పిన్నర్లు 80 వికెట్లు తీశారు. చివరి ఐదు వన్డేల్లో తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 296. 2019లో భారత్ ఇక్కడ ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. ఇప్పటివరకు ఇక్కడ పది వన్డేలు జరగగా.. తొలుత బ్యాటింగ్‌ చేసినవి, ఛేదించినవి చెరో ఐదు గెలిచాయి.

జట్లు:
భారత్: పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, మనీష్ పాండే, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్‌ సైనీ.

న్యూజిలాండ్‌: మార్టిన్‌ గప్టిల్‌, హెన్రీ నికోల్స్‌,కేన్ విలియమ్సన్‌, టామ్‌ లాథమ్‌, రాస్‌ టేలర్‌, జిమ్మీ నీషమ్‌, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌, టిమ్‌ సౌథీ, హమిష్‌ బెన్నెట్‌, మిచెల్ సాంట్నర్, కైల్‌ జెమీసన్‌.

Story first published: Tuesday, February 11, 2020, 7:29 [IST]
Other articles published on Feb 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+