
హైదరాబాద్: మౌంట్ మాంగనుయ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ 198 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఇన్నింగ్స్ 40వ ఓవర్లో పాండ్యా వేసిన బంతిని ఆడిన నికోల్స్(6) వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అ తర్వాత క్రీజులోకి వచ్చిన శాంటర్న్(3)ను సైతం హార్దిక్ పాండ్యా కాసేపటికే పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆతిథ్య జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 45 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 222 పరుగులు చేసింది. క్రీజులో రాస్ టేలర్(81), బ్రాస్‌వెల్(2) పరుగులతో ఉన్నారు.
అంతకముందు న్యూజిలాండ్ మెరుగైన స్కోరు సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్(81), టామ్ లాథమ్(51) ఆదుకున్నారు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీలు సాధించారు.
వీరిద్దరూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 62 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత లాథమ్ నాలుగో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. భారత స్పిన్నర్ చహల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన లాథమ్.. అంబటి రాయుడుకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
మరో 13 పరుగుల వ్యవధిలో హెన్రీ నికోలస్(6)ను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వేసిన మరో ఓవర్‌లో శాంటర్న్ పెవిలియన్ చేరాడు. దాంతో 20 పరుగుల వ్యవధిలో కివీస్ మూడు వికెట్లను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మున్రో(7) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, ఆపై కాసేపటికి గప్టిల్(13) కూడా ఔటయ్యాడు. దాంతో 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కివీస్ కోల్పోయింది.
ఆ తరుణంలో కేన్ విలియమ్సన్-రాస్ టేలర్ జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 33 పరుగులు జత చేసిన తర్వాత విలియమ్సన్(28) పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తుది జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి.
తొడ కండాలు పట్టేయడంతో ధోనికి విశ్రాంతినిచ్చిన కెప్టెన్ కోహ్లీ అతని స్థానంలో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌ని తీసుకున్నాడు. ఇక గత రెండు వన్డేలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయిన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ స్థానంలో హార్దిక్ పాండ్యాకి అవకాశమిచ్చాడు.