Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అయ్యర్‌, రాహుల్ హాఫ్ సెంచరీలు.. భారత్ స్కోర్ 213/4!!

India Vs New Zealand 3rd ODI: KL Rahul fifty pushes India after Shreyas Iyer exit

మౌంట్‌ మాంగనూయ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, లోకేష్ రాహుల్ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. అయ్యర్‌ 52 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రాహుల్ 66 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసాడు. హాఫ్ సెంచరీ అనంతరం ధాటిగా ఆడే క్రమంలో అయ్యర్‌ క్యాచ్ ఔట్ అయ్యాడు. జిమ్మీ నీశమ్ బౌలింగ్‌లో అయ్యర్ (62) పెవిలియన్ చేరాడు. రాహుల్ మాత్రం మనీష్ పాండే అండతో స్కోర్ బోర్డును ముందుకు నడుపుతున్నాడు.

టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. 32 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (1), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (9) తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరారు. కైల్ జెమీసన్‌ బౌలింగ్‌లో మయాంక్‌ బోల్డ్ కాగా.. బెనెట్‌ బౌలింగ్‌లో జేమీసన్‌కు క్యాచ్‌ ఇచ్చి విరాట్‌ వెనుదిరిగాడు. దీంతో 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది.

ఈ దశలో క్రీజులో కుదురుకున్న మరో ఓపెనర్‌ పృథ్వీ షా (42 బంతుల్లో 40; ఫోర్లు 3, సిక్స్‌లు 2) మెరుపులు మెరిపించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ అండతో బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు వేగం పెంచాడు. అయ్యర్‌ మాత్రం నెమ్మదిగా ఆడుతూ షాకు సహకారం అందించాడు. కుదురుకున్న షా అనూహ్యంగా రనౌట్‌ కావడంతో భారత్‌ మూడో వికెట్‌ చేజార్చుకుంది. బెనెట్‌ వేసిన 13వ ఓవర్లో రెండో పరుగు కోసం ప్రయత్నించి షా.. రనౌట్‌ అయ్యాడు. పృథ్వీ డైవ్‌ చేసినా ఫలితం లేకపోయింది. తొలి అరంగేట్రం వన్డేలో 20 పరుగులు చేసిన పృథ్వీ.. రెండో వన్డేలో 24 పరగులు చేశాడు.

భారత్‌ మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో ఓపికగా క్రీజులో పాతుకుపోయిన అయ్యర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కేఎల్‌ రాహుల్‌ సాయంతో అయ్యర్‌ స్కోరు బోర్డును పరుగు పెట్టించాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 8వ హాఫ్‌సెంచరీ పూర్తి చేసాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో అయ్యర్‌ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రాహుల్ హాఫ్ సెంచరీ చేసాడు. అతనికి మనీష్ పాండే చక్కటి సహకారం అందిస్తున్నాడు. ఈ జోడి భారత్ స్కోరును 200 దాటించింది. ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ (75), మనీష్ పాండే (23) క్రీజులో ఉన్నారు. 39 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 4 వికెట్లకు 213 పరుగులు చేసింది.

Story first published: Tuesday, February 11, 2020, 10:35 [IST]
Other articles published on Feb 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+