Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs New Zealand: రెండో టీ20 ప్రివ్యూ: ఎప్పుడు, ఎక్కడ ఎలా వీక్షించాలి!

India vs New Zealand, 2nd T20I Preview: When and where to watch, possible XI and more

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం రెండో టీ20 జరగనుంది. ఐదు వన్డేల సిరిస్‌ను 4-1తో గెలిచిన టీమిండియాకు ఆతిథ్య జట్టు తొలి టీ20లో షాకిచ్చింది. దీంతో సిరిస్ వేటలో నిలవాలంటే రెండో టీ20లో టీమిండియా తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. ఒకవేళ రెండో టీ20లో భారత్ ఓడిపోతే సిరిస్ న్యూజిలాండ్ కైవసం అవుతుంది. అదే రెండో టీ20లో భారత్ విజయం సాధిస్తే న్యూజిలాండ్ గడ్డపై మరో సిరిస్ వేటలో నిలుస్తుంది. దీంతో రెండో టీ20లో టీమిండియా తప్పకుండా పంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రెండో టీ20లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

తొలి టీ20లో భారత్ విఫలం

తొలి టీ20లో భారత్ విఫలం

తొలి టీ20లో టీమిండియా టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా ఓపెనర్ రోహిత్ శర్మ విఫలమయ్యాడు. కోహ్లీ స్థానంలో మూడో స్థానంలో బరిలోకి దిగిన ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ 18 బంతుల్లో 27 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, చివరి రెండు వన్డేల్లో చోటు దక్కించుకున్న శుభమన్ గిల్‌కు రెండో టీ20లో చోటు దక్కడం కష్టమే.

పంత్ రాకతో బలంగా మిడిలార్డర్

పంత్ రాకతో బలంగా మిడిలార్డర్

న్యూజిలాండ్‌తో వన్డే సిరిస్‌కు దూరమైన రిషబ్ పంత్... టీ20 సిరిస్‌లో చోటు దక్కించుకోవడంపై మిడిలార్డర్ బలంగా ఉంది. అయితే, తొలి టీ20లో ఆశించిన స్థాయిలో పంత్ రాణించలేదు. తొలి టీ20లో మిడిలార్డర్ బ్యాట్స్‌‌మెన్లు దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యాలు పేలవ ప్రదర్శనతో పెవిలియన్‌కు చేరారు. తొలి టీ20లో ధోనికి దూకుడుగా ఆడిన సంగతి తెలిసిందే.

భారీగా పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లు

భారీగా పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లు

మరోవైపు తొలి టీ20లో భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. భువనేశ్వర్ కుమార్‌తో పాటు ఖలీల్ అహ్మద్‌, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌తో సహా అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మరోవైపు న్యూజిలాండ్ ఓపెనర్లు విజృంభించడంతో తొలి టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 219 పరుగులు చేసింది.

తొలి టీ20లో గెలిచిన ఉత్సాహంతో బరిలోకి కివీస్

తొలి టీ20లో గెలిచిన ఉత్సాహంతో బరిలోకి కివీస్

దీంతో రెండో టీ20లో ఖలీల్‌ అహ్మద్ స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌, సిద్ధార్థ్‌ కౌల్‌లో ఎవరో ఒకరికి చోటు దక్కనుంది. మరోవైపు కృనాల్ పాండ్యా, చాహల్ ఫరవాలేదనిపించారు. దీంతో వీరిస్థానానికి ఎటువంటి ఢోకా లేదు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు వన్డే సిరిస్‌ను చేజార్చుకున్నప్పటికీ... తొలి టీ20లో గెలిచిన ఉత్సాహాంతో బరిలోకి దిగుతుంది.

దూకుడుగా కివీస్ ఓపెనర్లు

దూకుడుగా కివీస్ ఓపెనర్లు

ముఖ్యంగా ఓపెనర్లు దూకుడుగా ఆడటం ఆజట్టుకు కలిసొచ్చే అంశం. బ్యాట్స్‌మెన్లకు తోడు బౌలర్లు సైతం రాణించడంతో తొలి టీ20లో న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని సాధించింది. ముఖ్యంగా సొంత గడ్డపై కివీస్ బౌలర్లు ఇష్‌ సోధి, శాంట్నర్‌ సైతం భారత బ్యాట్స్‌మెన్‌ పరుగులు రాబట్టకుండా కట్టడి చేశారు.

మ్యాచ్ ప్రసారం

మ్యాచ్ ప్రసారం

స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్స్‌లో మ్యాచ్ 11.30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం.

హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్

1
44086
Story first published: Thursday, February 7, 2019, 16:07 [IST]
Other articles published on Feb 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+