నేడు కివీస్‌తో భారత్ రెండో టీ20.. శార్దూల్ స్థానంలో సైనీ.. బెంచ్‌కే శాంసన్, పంత్!!

ఆక్లాండ్: సుదీర్ఘ పర్యటనలో భాగంగా తొలి టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్‌ను చిత్తుచేసిన భారత్.. ఆదివారం ఈడెన్ పార్క్‌లోనే కివీస్‌ను మరోసారి ఢీకొననుంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గితే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచవచ్చు. ఎందుకంటే.. కివీస్ ఈ మ్యాచ్ ఓడితే మిగతా మూడింట్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ ఏడాది చివర్లో పొట్టి ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో లోటుపాట్లు సరిదిద్దుకునేందుకు కోహ్లీసేనకు ఇది చక్కటి అవకాశం. తొలి మ్యాచ్ జోరు కొనసాగించాలని భారత్ భావిస్తుంటే.. అడ్డుకట్ట వేసేందుకు కివీస్ కసరత్తులు చేస్తోంది.

శార్దూల్ స్థానంలో సైనీ:
అద్భుత విజయం అందుకున్న తుది జట్టులో సాధారణంగా మార్పులు చేయడానికి కేప్టెన్ విరాట్ కోహ్లీ ఇష్టపడడు. అయితే గత మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న పేసర్ శార్దుల్ ఠాకూర్‌కు బదులుగా నవదీప్ సైనీకి అవకాశం దక్కవచ్చు. ఇది మినహా మరో మార్పు లేకుండా జట్టు బరిలోకి దిగనుంది. కెప్టెన్, కోచ్ ప్రణాళికలకు అనుగుణంగానే తుది జట్టు ఎంపిక ఉంటుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనూ సంజు సాంసన్, రిషబ్ పంత్‌లకు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు.

ఫామ్‌లో టాపార్డర్:
తొలి టీ20లో ఓపెనర్ రోహిత్ శర్మ విఫలమైనా అతని స్థాయి ఇన్నింగ్స్ ఆడేందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఇక లోకేష్ రాహుల్ గురించి ఇటీవల ఎంత చెప్పినా తక్కువే. అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనతో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎక్కడైనా ఆడుతూ పరుగుల వరద పారిస్తునాడు. ఎప్పటిలాగే విరాట్ కోహ్లీ కూడా తనదైన శైలిలో చెలరేగిపోగలడు. తొలి టీ20లో శ్రేయస్ అయ్యర్ ఒత్తిడిలోనూ ఏమాత్రం బెదరకుండా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇక నాలుగో స్థానాన్ని తన పేరిట రాసుకున్నట్లే.

బుమ్రా ప్రదర్శన హైలైట్:
మిడిలార్డర్‌లో మనీశ్ పాండే, శివమ్ దూబే కూడా బాధ్యతలు పంచుకోవాల్సిన అవసరముంది. దూబేతో పూర్తి కోటా బౌలింగ్ చేయించి అదనపు స్పిన్నర్‌ను తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. మరోవైపు రవీంద్ర జడేజా కూడా ఆకట్టుకున్నాడు. భారీ స్కోర్ల మ్యాచ్‌లో బుమ్రా ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ దూసుకుపోతున్న సమయంలో చివరి రెండు ఓవర్లలో అతను కివీస్‌ను కట్టడి చేసిన తీరు అద్భుతం. సీనియర్ షమీ తన బౌలింగ్‌పై మరింత నియంత్రణ ఉంచాల్సి ఉంది.

మార్పుల్లేకుండానే కివీస్:
తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసిన కూడా ఓడిపోవడం న్యూజిలాండ్‌ను నిరాశపర్చింది. మార్పుల్లేకుండానే ఆ జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోసారి ఓపెనర్లు మన్రో, గప్టిల్‌ల నుంచి కివీస్ శుభారంభం ఆశిస్తోంది. విలియమ్సన్, టేలర్ తమపై విమర్శలకు దీటుగా స్పందించి భారీషాట్లతో హోరెత్తిస్తూ హాఫ్ సెంచరీలు సాధించగలిగారు. అయితే మిడిలార్డర్‌లో గ్రాండ్‌హోమ్, సీఫెర్ట్ ఇద్దరూ విఫలమవడం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది. కీలక బౌలర్లు లేకపోవడంతో జట్టు బౌలింగ్ బలహీనపడింది. బెన్నెట్, టిక్‌నర్ మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది. సౌతీ, సాన్‌ట్నర్ రాణించడం కూడా కీలకం.

తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చహల్, జస్ప్రిత్ బుమ్రా, నవదీప్ సైనీ, మహ్మద్ షమీ.
న్యూజిలాండ్: గప్టిల్, మున్రో, విలియమ్సన్ (కెప్టెన్), సైఫెర్ట్, టేలర్, గ్రాండ్‌హోమ్, శాంట్నర్, సోధి, సౌతీ, కుగ్‌లిన్, బెనెట్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications