Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాజ్ కోట్‌లో కొట్టేనా?: టీ20 సిరిస్‌పై కన్నేసిన కోహ్లీసేన

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఢిల్లీలో జరిగిన తొలి టీ20లో 53 పరుగుల తేడాతో గెలిచిన కోహ్లీసేన టీ20 సిరిస్‌పై కన్నేసింది. రాజ్‌కోట్‌ వేదికగా శనివారం జరిగే రెండో టీ20లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు తొలి టీ20లో విఫలమైన కివీస్‌ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా సరే గెలవాలనే కసితో ఉంది.

రాజ్ కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శనివారం రాత్రి 7 గంటలకు ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆరంభం కానుంది. కివీస్‌తో తొలి టీ20లో విజయం సాధించి పదేళ్ల నిరీక్షణకు తెరదించిన సంగతి తెలిసిందే. శనివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే ఇంకో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.

నెట్స్‌లో తీవ్రంగా శ్రమించిన టీమిండియా

నెట్స్‌లో తీవ్రంగా శ్రమించిన టీమిండియా

ఇందులో భాగంగా శుక్రవారం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. మరోవైపు న్యూజిలాండ్ సైతం రెండో టీ20 కోసం ప్రత్యేకంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. రెండో టీ20 జరిగే రాజ్‌కోట్ స్టేడియంలో ఇప్పటివరకు కేవలం ఒక అంతర్జాతీయ టీ20 మాత్రమే జరిగింది. 2013లో ఆసీస్‌తో జరిగిన టీ20లో భారత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

రెండు వన్డేల్లోనూ ఓటమి పాలైన భారత్

రెండు వన్డేల్లోనూ ఓటమి పాలైన భారత్

ఈ స్టేడియంలో జరిగిన రెండు వన్డేల్లోనూ భారత్ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ (2013), దక్షిణాఫ్రికా (2015)లతో ఈ స్టేడియం వేదికగా తలపడిన రెండు సార్లు టీమిండియా ఓటమి పాలైంది. పిచ్‌ బ్యాట్స్‌మెన్‌కు సహకరిస్తుంది. భారీ స్కోర్లకు అవకాశముంది. మరోవైపు రెండో టీ20లో టీమిండియాపై అంతగా ఒత్తిడి లేదు.

అద్భుతమైన ఫామ్‌లో శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ

అద్భుతమైన ఫామ్‌లో శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ

ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. తొలి టీ20లో వీరిద్దరూ చెరో 80 పరుగులు చేసి 158 పరుగుల భాగస్వామ్యం అందించారు. భారత్‌కు ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. ఇక, టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా పాండ్యా, ధోనీ సత్తా చాటగలరు. తొలి టీ20తో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన శ్రేయస్‌ అయ్యర్‌కు రెండో టీ20లో బ్యాటింగ్ ఆడే అవకాశం రావొచ్చు.

సిరాజ్ కు చోటు దక్కేనా?

సిరాజ్ కు చోటు దక్కేనా?

కివీస్‌తో టీ20 సిరీస్‌కు హైదరాబాద్ కుర్రాడు సిరాజ్ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే తొలి టీ 20 తుది జట్టులో అతను ఆడే అవకాశం రాలేదు. కాగా, తొలి టీ20 తరువాత ఆశిష్ నెహ్రా కెరీర్‌కు వీడ్కోలు పలకడంతో అతని స్థానంలో సిరాజ్‌ను ఆడిస్తారా? లేదా అన్నది జట్టు యాజమాన్య నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

తొలి టీ20లో తేలిపోయిన కివీస్

తొలి టీ20లో తేలిపోయిన కివీస్

సిరాజ్‌కు చోటు దక్కకపోతే మాత్రం దినేశ్ కార్తీక్, కేఎల్ రాహుల్‌లో ఒకరికి ఆడే అవకాశం దక్కవచ్చు. ఇక, వన్డేల్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన కివీస్‌ పేసర్లు ట్రెంట్‌ బౌల్ట్‌, టిమ్‌ సౌథీ, గ్రాండ్‌హోమ్‌ టీ20లో తేలిపోయారు. టామ్‌ లాథమ్‌ మినహా బ్యాటింగ్‌లో ఎవరూ రాణించలేదు. ఫీల్డింగ్‌ సైతం చెత్తగా ఉంది.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

భారత్‌: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, యజ్వేంద్ర చాహల్‌, శిఖర్‌ ధావన్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ, శ్రేయస్‌ అయ్యర్‌, దినేశ్‌ కార్తీక్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ సిరాజ్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌

న్యూజిలాండ్‌: కేన్‌ విలియమ్సన్‌ (సారథి), ట్రెంట్‌ బౌల్ట్‌, టామ్‌ బ్రూస్‌, గ్రాండ్‌హోమ్‌, మార్టిన్‌ గప్తిల్‌, మ్యాట్‌ హెన్రీ, టామ్‌ లేథమ్‌, హెన్రీ నికోల్స్‌, ఆడమ్‌ మిల్నే, కొలిన్‌ మన్రో, గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల్‌ శాంట్నర్‌, ఇష్‌ సోధి, టిమ్‌ సౌథీ

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+