హైదరాబాద్: రాజ్ కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమి పాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రెండో టీ20లో న్యూజిలాండ్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

దీంతో సిరీస్ 1-1తో సమం అయింది. సిరిస్ విజేత ఎవరో తేల్చే మూడో టీ20 ఇరు జట్ల మధ్య తిరువనంతపురంలో నవంబర్ 7న జరగనుంది. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ లక్ష్య ఛేదనలో తడబడింది.
197 పరుగుల లక్ష్యఛేదనలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (65) ఒంటరి పోరాటం చేశాడు. ధోనీ (49) త్రుటిలో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ (23) మినహా మరే ఆటగాడు రాణించకపోవడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. కివీస్ బౌలర్ ట్రెంట్‌బౌల్ట్ 4 వికెట్లు తీశాడు.
భారత్ ఇన్నింగ్స్ సాగిందిలా:
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
రాజ్ కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. కోహ్లీ (65) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ (5) వెనుదిరిగాడు. 3 బంతుల్లో 5 పరుగులు చేసి కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. భారత్ విజయానికి 12 బంతుల్లో 65 పరుగులు చేయాల్సి ఉంది.
కోహ్లీ 65 ఔట్
రాజ్ కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 42 బంతుల్లో 65 పరుగులు చేసి కోహ్లీ అవుటయ్యారు. 17 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయిన భారత్ 125 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 18 బంతుల్లో 72 పరుగులు చేయాల్సి ఉంది. కోహ్లీ తర్వాత అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చారు.
16 ఓవర్లకు భారత్ 122/4
రెండో టీ20లో భారత్ తడబడుతోంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 16 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లీ 65, ధోనీ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి 24 బంతుల్లో 75 పరుగులు చేయాల్సింది.
కోహ్లీ హాఫ్ సెంచరీ
రాజ్ కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 32 బంతుల్లో 6 ఫోర్లు సాయంతో కోహ్లీ 50 పరుగులు చేశాడు. దీంతో 13 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లీ 58, ధోని 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్
రెండో టీ20లో భారత్ తడబడుతోంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జట్టు స్కోరు 6 పరుగుల వద్ద శిఖర్ ధావన్ (1) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 11 పరుగుల వద్ద మరో ఓపెనర్ రోహిత్ శర్మ (5) కూడా అవుటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ క్రీజులో నిలదొక్కుకుంటూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అయ్యర్ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత వెంటనే క్రీజులోకి వచ్చిన పాండ్యా ఒకే ఒక పరుగు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ 9.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది.
నిలకడగా ఆడుతోన్న భారత్
రెండో టీ20లో న్యూజిలాండ్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా నిలకడగా ఛేదిస్తోంది. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (22), విరాట్ కోహ్లీ (16) పరుగులతో క్రీజులో ఉన్నారు.
11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్
రాజ్ కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 197 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరు పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్ (1) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 11 పరుగుల వద్ద మరో ఓపెనర్ రోహిత్ శర్మ (5) కూడా అవుటయ్యాడు. ఈ రెండు వికెట్లను బౌల్ట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం రెండు ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది.
కివీస్ ఇన్నింగ్స్ సాగిందిలా:
భారత్ విజయ లక్ష్యం 197
రాజ్ కోట్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 197 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. భారీ సిక్సర్లు, ఫోర్లతో భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. గుప్తిల్ 45, విలియమ్సన్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. ఓపెనర్ మన్రో భారీ షాట్లు బాదుతూ సెంచరీతో చెలరేగాడు.
54 బంతుల్లో సెంచరీ చేశాడు. మన్రో ధాటికి స్కోరు 200 దాటేలా కనిపించినా చివర్లో భువి, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి అతడిని కట్టడి చేశాడు. మన్రో 109, టామ్ బ్రూసీ 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో హైదరాబాదీ కుర్రాడు సిరాజ్ ఒక వికెట్ తీయగా, చాహల్ మరో వికెట్ తీశాడు.
టీ20ల్లో రెండో సెంచరీ బాదిన మున్రో
రాజ్ కోట్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ ఓపెనర్ మున్రో సెంచరీ నమోదు చేశాడు. 54 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 101 పరుగులు చేశాడు. టీ20ల్లో మున్రోకి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. దీంతో 19 ఓవర్లు ముగిసే సరికి కివీస్ రెండు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ప్రస్తుతం మున్రో 104, బ్రూస్ 14 పరుగుతో క్రీజులో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన కివీస్
రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన హైదరాబాద్ పేసర్ సిరాజ్ తొలి వికెట్ తీసుకున్నాడు. రెండు ఫోర్లు బాది జోరు మీదున్నట్టు కనిపించిన కెప్టెన్ విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 15 ఓవర్లు ముగిసే సరికి కివీస్ రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. మున్రో 79, బ్రూస్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన కివీస్
రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఓపెనర్లు కొలిన్ మున్రో, మార్టిన్ గుప్టిల్ భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. వరుసగా సిక్సర్లు, ఫోర్లు తొలి వికెట్‌కు 105 పరుగులు భాగస్వామ్యం అందించారు. చాహాల్ వేసిన 12వ ఓపర్ తొలి బంతికి మార్టిన్ గుప్తిల్(45) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ బాటపట్టాడు. 13 ఓవర్లు ముగిసే సరికి కివీస్ వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మున్రో(60), కేన్ విలియమ్సన్ (7) ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న కివీస్ ఓపెనర్లు
రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో కివీస్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. టీమిండియా బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీలకు తరలిస్తున్నారు. ఓపెనర్లు ఇద్దరూ పోటీ పడి ఆడుతున్నారు. కోలిన్ మున్రో 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేయగా, మార్టిన్ గుప్టిల్ 40 బంతుల్లో 3 ఫోర్లు, మూడు సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. 11 ఓవర్లు ముగిసే సరికి కివీస్ వికెట్ కోల్పోకుండా 104 పరుగులు చేసింది.
కివీస్ బ్యాటింగ్, నెహ్రా స్ధానంలో సిరాజ్‌కు చోటు
మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టీ20 రాజ్‌కోట్ వేదికగా ప్రారంభమైంది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ సిరిస్‌తో జట్టులో చోటు దక్కించుకున్న మహమ్మద్ సిరాజ్ అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నెహ్రా స్ధానంలో సిరాజ్‌కు జట్టు మేనేజ్‌మెంట్ చోటు కల్పించింది. ఐపీఎల్‌లో అతడు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బౌలింగ్‌లో అద్భుతంగా రాణించాడు. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అతడికి భారత క్యాప్ అందించాడు.
ఈ రెండో టీ20లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు తొలి టీ20లో విఫలమైన కివీస్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా సరే గెలవాలనే కసితో ఉంది. కివీస్‌తో తొలి టీ20లో విజయం సాధించి పదేళ్ల నిరీక్షణకు తెరదించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే ఇంకో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.
రెండో టీ20 జరిగే రాజ్‌కోట్ స్టేడియంలో ఇప్పటివరకు కేవలం ఒక అంతర్జాతీయ టీ20 మాత్రమే జరిగింది. 2013లో ఆసీస్‌తో జరిగిన టీ20లో భారత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ స్టేడియంలో జరిగిన రెండు వన్డేల్లోనూ భారత్ ఓటమి పాలైంది.
ఇంగ్లాండ్ (2013), దక్షిణాఫ్రికా (2015)లతో ఈ స్టేడియం వేదికగా తలపడిన రెండు సార్లు టీమిండియా ఓటమి పాలైంది. పిచ్ బ్యాట్స్‌మెన్‌కు సహకరిస్తుంది. భారీ స్కోర్లకు అవకాశముంది. రెండో టీ20లో టీమిండియాపై అంతగా ఒత్తిడి లేదు.
ఇండియా: రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎంఎస్ ధోనీ, శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, అక్సర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, మొహమ్మద్ సిరాజ్
న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, కోలిన్ మున్రో, కానె విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రీ నిఖోల్స్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, మిచెల్ సాంట్నెర్, ఆడం మిల్నె, సోధీ, ట్రెంట్ బౌల్ట్