For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌.. మార్పుల్లేకుండానే బరిలోకి ఇరుజట్లు!!

India Vs New Zealand 2nd T20 : New Zealand To Bat First | Both Teams Remain Same
India vs New Zealand 2nd T20I: New Zealand have won the toss and have opted to bat

ఆక్లాండ్‌: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌లో మరికొద్దిసేపట్లో న్యూజిలాండ్‌, భారత్‌ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు మార్పుల్లేకుండానే బరిలోకి దిగుతున్నాయి. మిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలాంటి మార్పులు చేయకపోవడంతో.. స్పెషలిస్టు కీపర్‌లు సంజూ శాంసన్‌, రిషభ్‌ పంత్‌లకు మరోసారి తుది జట్టులో చోటు దక్కలేదు. భారత్ ఈ మ్యాచ్‌లో కూడా ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగుతోంది.

ఈడెన్‌ పార్క్‌ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం. చిన్న బౌండరీలు కావడంతో పరుగుల వరద ఖాయం. ఇదే మైదానంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కూడా భారీగా పరుగులు నమోదయ్యాయి. రెండు జట్లు 200+ స్కోర్ నమోదు చేసాయి. గత ఏడాది కివీస్‌ పర్యటనలో భారత్‌ వన్డే సిరీస్‌ను 4-1తేడాతో కైవసం చేసుకోగా.. టీ20 సిరీస్‌ను 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కివీస్‌తో భారత్‌ 12 టీ20ల్లో తలపడగా.. కేవలం నాలుగు మ్యాచుల్లోనే విజయం సాధించింది.

1
46204

ఈ ఏడాదే మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్‌ ఉండటంతో న్యూజిలాండ్‌-భారత్‌ జట్లు ఈ సిరీస్‌ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు ప్రపంచకప్‌నకు ముందు ప్రయోగాలు చేసేందుకు ఈ సిరీస్‌ను వేదికగా చేసుకున్నాయి. తొలి మ్యాచ్ జోరు కొనసాగించాలని భారత్‌ భావిస్తుంటే.. అడ్డుకట్ట వేసేందుకు కివీస్‌ కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

Teams:
India (Playing XI): Rohit Sharma, Lokesh Rahul(w), Virat Kohli(c), Shreyas Iyer, Shivam Dube, Manish Pandey, Ravindra Jadeja, Shardul Thakur, Mohammed Shami, Yuzvendra Chahal, Jasprit Bumrah.

New Zealand (Playing XI): Martin Guptill, Colin Munro, Kane Williamson(c), Colin de Grandhomme, Ross Taylor, Tim Seifert(w), Mitchell Santner, Blair Tickner, Tim Southee, Ish Sodhi, Hamish Bennett.

Story first published: Sunday, January 26, 2020, 12:15 [IST]
Other articles published on Jan 26, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+