Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2nd T20I: టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌

 India Vs New Zealand, 2nd T20I Live Updates: Kane Williamson wins toss, elects to bat; both teams remain unchanged

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టీ20 ప్రారంభమైంది. ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కుల్దీప్‌ను తుది జట్టులో తీసుకునే అవకాశం ఉందని తొలుత భావించినా, గత జట్టునే కొనసాగించేందుకు భారత్‌ మొగ్గుచూపింది.

మరోవైపు కివీస్‌ కూడా టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగింది. బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా... ఈ మూడు టీ20ల సిరీస్‌‌లో ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు ఇటీవల సొంతగడ్డపై 1-4 తేడాతో వన్డే సిరీస్‌ని చేజార్చుకున్న న్యూజిలాండ్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి 2-0తో టీ20 సిరీస్‌ని కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది.

1
44086


జట్ల వివరాలు:
భారత్ తుది జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, రిషబ్ పంత్, విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్, మహేంద్రసింగ్ ధోని ( వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య‌, భువనేశ్వర్ కుమార్, చాహల్, ఖలీల్ అహ్మద్

న్యూజిలాండ్ జట్టు:
కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), టీమ్‌ సీఫెర్ట్, కొలిన్‌ మున్రో, డార్లీ మిచెల్‌, రాస్‌ టేలర్‌, కొలిన్‌ గ్రాండ్‌ హోమ్‌, మిచెల్‌ సాన్‌ట్నర్,కుగ్లీన్, టిమ్‌ సౌతీ, ఇష్‌ సోధి, ఫెర్గూసన్‌

Story first published: Friday, February 8, 2019, 11:46 [IST]
Other articles published on Feb 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+